Moviesర‌కుల్ పెద్ద ప‌త్తిత్తు... శ్రీరెడ్డి ఘాటు వీడియో

ర‌కుల్ పెద్ద ప‌త్తిత్తు… శ్రీరెడ్డి ఘాటు వీడియో

డ్ర‌గ్ కేసులో చిక్కుకున్న ర‌కుల్ ప్రీత్‌సింగ్‌పై కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకు ప‌డింది. గ‌తంలో తాను టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని చెప్పిన‌ప్పుడు ర‌కుల్ ఇక్క‌డ అలాంటివి ఏమీ లేవ‌ని చెప్పింద‌ని.. పైగా టాలివుడ్ లో డ్రగ్స్ వాడే కల్చర్ కూడా లేదని ఆమె అన్న విష‌యం శ్రీరెడ్డి గుర్తు చేసింది. అలాగే అప్ప‌ట్లో ర‌కుల్ క్యాండిల్ ర్యాలీల‌తో పెద్ద ప‌త్తిత్తులా మాట్లాడింద‌ని కూడా గుర్తు చేసింది. ఇక‌ టాలీవుడ్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారా అంటూ మంచు లక్ష్మి సైతం వ్యాఖ్యానించిందని తెలిపింది.

 

 

ఇక త‌న‌ను గ‌తంలో విమ‌ర్శించిన వారికి ఇప్పుడు తెలిసి వ‌స్తోంద‌ని.. క‌ర్మ ఎవ్వ‌రిని వ‌దిలి పెట్ట‌దు అన్న విష‌యం ఇప్పుడు వారికి గుర్తుకు వ‌స్తుందా ? అని కూడా ఫైర్ అయ్యింది. తనను విమర్శించినవారు కొందరు కరోనా భారీన ప‌డ్డార‌ని చెప్పిన ర‌కుల్‌.. త్వ‌ర‌లోనే ఒక్కొక్క‌రి రంకు బాగోతాలు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని కూడా చెప్పింది. దివంగత నటుడు సుశాంత్ ప్రేయసి రియా డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో ఆమె విచారణలో రకుల్ ప్రీత్ పేరును భయట పెట్టడంతో శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news