జైల్లోనే కొట్లాట‌కు దిగిన సంజ‌న, రాగిణి.. ఒక్కటే ర‌చ్చ

బాలీవుడ్ హీరోయిన్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత జ‌రుగుతోన్న విచార‌ణ‌లో డ్ర‌గ్ ఉదంతం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది ఇప్పుడు శాండ‌ల్‌వుడ్‌కు కూడా పాకింది. కొద్ది రోజులుగా క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేస్తోన్న డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజ‌న గ‌ల్రానీ అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని మ‌డివాడ మ‌హిళా సంర‌క్ష‌ణా కేంద్రంలో ఉన్నారు.

 

సంజ‌న, రాగిణి ఒక‌రిపై మ‌రొక‌రు కోట్లాట‌కు దిగుతున్నార‌ని తెలుస్తోంది. తాను అరెస్టు కావ‌డానికి నువ్వే కార‌ణం అంటూ సంజ‌న ముందుగా రాగిణిపై ఫైర్ అయ్యింద‌ట‌. ఆ వెంట‌నే రాగిణి కూడా కాదు నా అరెస్టుకు నువ్వే కార‌ణం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌. వీరిద్ద‌రు కోపం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిని మ‌రొక‌రు తిట్టుకుంటూ నానా ర‌చ్చ చేస్తున్నార‌ని అంటున్నారు.

 

ఇక కేసు విచార‌ణ‌లో భాగంగా వీరిని డోప్ టెస్టుల కోసం బెంగళూరులోని కేజీ జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లినా అక్క‌డ కూడా నానా ర‌చ్చ చేశార‌ని తెలుస్తోంది. ఇక ఈ కేసులో అరెస్టు అయిన రాహుల్‌, ప్ర‌శాంత్ రంగా, ప్ర‌తీక్ శెట్టి, నియాజ్ త‌దిత‌రులు త‌ల వెంట్రుక‌లు, ర‌క్తం సేక‌రించి ప‌రీక్ష‌లు చేస్తున్నారు.