Moviesపోలీసుల విచార‌ణ‌లో సంజ‌న‌కు కోట్ల ఆస్తులు... ఒక్క బెంగ‌ళూరులోనే 10 ప్లాట్లు..

పోలీసుల విచార‌ణ‌లో సంజ‌న‌కు కోట్ల ఆస్తులు… ఒక్క బెంగ‌ళూరులోనే 10 ప్లాట్లు..

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ మాఫియా కేసు విచార‌ణ‌లో అనేకానేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ సంజ‌న‌ను శుక్ర‌వారం కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచార‌ణ‌లో సంజ‌న చెప్పిన వివ‌రాల‌తో పోలీసుల‌కు క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి. సంజ‌న త‌న‌కు ఒక్క బెంగ‌ళూరులోనే ప‌ది ప్లాట్లు ఉన్నాయ‌ని చెప్పింద‌ట‌. ఇక బెంగ‌ళూరు న‌గ‌రంతో పాటు క‌ర్నాట‌క‌, ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఆమెకు ఆస్తులు ఉన్న‌ట్టు వెల్ల‌డైంద‌ట‌. చెప్పుకోద‌గ్గ ఒక్క హిట్టు సినిమా లేని సంజ‌న‌కు అన్ని ఆస్తులు ఎలా వ‌చ్చాయ‌న్న అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఇక సంజ‌న ఫ్లాట్స్‌కు ఎవరెవరు వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కన్నడ సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు, సంగీత దర్శకులు కూడా ఈ ప్లాట్స్‌కు వ‌చ్చి వెళ్లిన‌ట్టు విచార‌ణ‌లో తేలింద‌ని అంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సంజనా ఫ్లాట్‌కు వెళ్లిన సినిమా రంగానికి చెందిన ప్రముఖులు న్యాయ సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news