Moviesబిగ్‌బాస్‌లో క‌ట్ట‌ప్ప ఆ యాంక‌రే... అత‌డితోనే మోనాల్ పెళ్లి

బిగ్‌బాస్‌లో క‌ట్ట‌ప్ప ఆ యాంక‌రే… అత‌డితోనే మోనాల్ పెళ్లి

బిగ్‌బాస్ ఆరో ఎపిసోడ్ ఓ మోస్త‌రుగా సాగింది. ఇంకా ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో షో చ‌ప్ప చ‌ప్ప‌గానే న‌డుస్తోంది. ఆరో ఎపిసోడ్లో కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాజశేఖర్ దివితో పులిహోర కలుపుతూ నూనెలో టీ పొడి వేశాడు. దీంతో బిగ్ బాస్ సభ్యులందరూ నవ్వారు. ఆ తర్వాత మోనాల్ తాను పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాన‌ని అఖిల్‌కు చెప్పింది. ప్ర‌స్తుతం ఎలాంటి రిలేష‌న్ షిప్‌లో లేన‌ని కూడా అంది.

ఇక ఇంట్లో స‌భ్యులు క‌ట్ట‌ప్ప ఎవ‌రో మ‌రోసారి చెప్పాల‌ని బిగ్‌బాస్ కండీష‌న్ పెట్టాడు. ఇంటి సభ్యుల్లో ఆరుగురు నోయల్ కు స్టాంప్ వేసి అతనే కట్టప్ప అని చెప్పగా నలుగురు లాస్యకు స్టాంప్ వేసి ఆమే కట్టప్ప అని చెప్పారు. దీంతో ఇప్పుడు కొత్త‌గా యాంక‌ర్ లాస్యే క‌ట్ట‌ప్ప అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్న‌నాయి. అయితే బిగ్‌బాస్ క‌ట్ట‌ప్ప స‌స్పెన్స్‌కు ఇంకా తెర‌దించ‌లేదు. త్వ‌ర‌లోనే కట్టప్ప ఎవరో చెబుతానంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

 

ఇక ఈ రోజు వీకెండ్ ప్రారంభం కావ‌డంతో హోస్ట్ నాగార్జున రానున్నాడు. ఈ రోజు ఎవ‌రు ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకుంటారా ? అన్న‌ది చూడాలి. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేష‌న్లో ఉండ‌గా… వీరిలో ఈ రోజు కొంద‌రు సేఫ్ అవ్వ‌గా రేపు మ‌రి కొంద‌రు సేఫ్ అవ్వ‌నున్నారు. ఇక ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కూడా ఆదివార‌మే ఉండ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news