Politicsప‌బ్జీ బ్యాన్‌.. చైనాకు ఎంత న‌ష్ట‌మో తెలిస్తే మైండ్ పోవాల్సిందే..

ప‌బ్జీ బ్యాన్‌.. చైనాకు ఎంత న‌ష్ట‌మో తెలిస్తే మైండ్ పోవాల్సిందే..

దేశ భ‌ద్ర‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం ప‌బ్జీ స‌హా 118 చైనా యాప్‌ల‌ను నిషేధించింది. దీంతో చైనా కంపెనీకి తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లింది. మ‌న దేశంలో ప‌బ్జీ గేమ్‌కు బానిస‌లు అయిన వారు ఏకంగా 14 కోట్ల మంది ఉన్నారు. వీరిలో యువ‌తే ఎక్కువుగా ఉన్నారు. ప‌బ్ జీకి అతిపెద్ద మార్కెట్ అయిన భార‌త్ ఈ గేమ్‌పై నిషేధం విధించ‌డంతో పబ్జీ సహా పలు యాప్ లను రూపొందించిన టెన్సెంట్ల‌కు భారీ న‌ష్టం వాటిల్లింది.

PUBG Ban: Government Bans 118 Chinese Apps and Games Including PUBG Mobile,  Apus Launcher, Rules of Survival | Technology News

ఈ గేమ్ బ్యాన్ చేయ‌డం వ‌ల్ల టెన్సెంట్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు (14 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లి ఉంటుందని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇది చైనా మార్కెట్ల‌కు కోలుకోలేద‌ని దెబ్బే. ఇది బ్యాన్ అయిన వెంట‌నే టెన్సెంట్ షేరు విలువ సైతం 2 శాతం ప‌డిపోయింద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

118 Chinese apps banned: Here are some alternatives to PUBG Mobile and  other most popular banned apps

మరోవైపు పబ్జీ సహా 118 చైనా యాప్లను భారత్ నిషేధించడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. త‌మ ఇన్వెస్ట‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ఆవేద‌న చెందుతోంది. భార‌త్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో చైనా ఇన్వెస్ట‌ర్ల స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల చ‌ట్ట‌బ్ధ ప్ర‌యోజ‌నాల‌కు భార‌త్ భంగం క‌లిగించింద‌ని కూడా చైనా ఆరోపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news