Moviesజైల్లో రియా బాధలు.. చాప‌మీదే నిద్ర.. ఫ్యాన్ కూడా లేదు..

జైల్లో రియా బాధలు.. చాప‌మీదే నిద్ర.. ఫ్యాన్ కూడా లేదు..

సుశాంత్‌సింగ్ మృతి చెందిన రోజు నుంచి నేటి వ‌ర‌కు కూడా జాతీయ మీడియా రియా చ‌క్ర‌వ‌ర్తిని వ‌ద‌ల‌డం లేదు. ఆమె ఇంటి వ‌ద్ద ఉంటే జాతీయ మీడియా ప్ర‌తినిధులు 24 గంట‌లు ఆమె ఇంటి ముందే కాపు కాచారు. ఆమె బ‌య‌ట‌కు వెళ్లినా, జైల్లో ఉన్నా కూడా ఆమెను మీడియా ప్ర‌తినిధులు వ‌ద‌ల‌డం లేదు. తాజాగా ఆమె ముంబైలోని మ‌హిళా జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మీడియా అక్క‌డ నుంచి కూడా రిపోర్టింగ్ స్టార్ట్ చేసేసింది.

రియా జైళ్లో మామూలు బాధ‌లు అనుభ‌వించ‌డం లేద‌ట‌. తాజాగా జాతీయ మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం మేర‌కు రియాకు  అధికారులు ఒక చాప మాత్రమే ఇచ్చారు. కనీసం ఒక దిండు కూడా ఇవ్వలేదు. ఇక ఆమెకు కేటాయించిన రూంలో కనీసం ఫ్యాన్ కూడా లేద‌ట‌. కోర్టు నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి ఉంటే మాత్ర‌మే ఆమెకు టేబుల్ ఫ్యాన్ ఇస్తార‌ట‌. ఇక అంద‌రితో స‌మానంగానే ఆమెకు రోజుకు రెండు సార్లు పాలు అందిస్తున్నార‌ట‌.

ఇక క‌రోనా టైం నేప‌థ్యంలో అంద‌రితో పాటు ఇస్తోన్న పండ్లు రియాకు కూడా ఇస్తున్నార‌ట‌. ఈ క‌థ‌నం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ప‌లువురు రియా ప‌ట్ల జాలి చూపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news