Moviesసుధీర్‌బాబు సినిమాల్లోకి రావ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదా... ఎమోష‌న‌ల్ మెసేజ్‌

సుధీర్‌బాబు సినిమాల్లోకి రావ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదా… ఎమోష‌న‌ల్ మెసేజ్‌

సూప‌ర్‌స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు గ‌త ద‌శాబ్ద కాలం నుంచి హీరోగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ కూడా మ‌హేష్‌పేరు కాని, త‌న మామ కృష్ణ పేరు కాని వాడుకోలేదు. అయితే స‌క్సెస్ మాత్రం అంద‌ని మావే అవుతోంది. తాజాగా నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి న‌టించిన వి సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయితే సుధీర్‌బాబు న‌ట‌న‌కు మాత్రం ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

 

ఇదిలా ఉంటే సుధీర్‌బాబుకు ఎన్నో మెసేజ్‌లు కూడా వ‌స్తున్నాయ‌ట‌. మిగిలిన మెసేజ్‌లు ఎలా ఉన్నా సినిమాలు అంటే ఏ మాత్రం గిట్ట‌ని త‌న తండ్రి నుంచి వ‌చ్చిన మెసేజ్ సుధీర్‌బాబు సంతోషాన్ని వెయ్యింద‌లు చేసింది. ఈ సినిమా బాగుంద‌ని చాలా మంది అమ్మ‌, నాన్న‌ల‌కు ప‌దే ప‌దే మెసేజ్‌లు పెడుతున్నారు… వారు ఆ ఆనందాన్ని త‌న‌తో షేర్ చేసుకున్నార‌ని… అందుకే మ‌ళ్లీ వెక్కి వెక్కీ ఏడ్చాన‌ని సుధీర్‌బాబు ఎమోష‌న‌ల్ అయ్యాడు.

 

 

 

ఇక బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌గా మంచి లైఫ్ ఉన్న సుధీర్‌బాబు అది వదులుకుని సినిమాల్లోకి రావ‌డం ఆయ‌న తండ్రికి ఇష్టం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎంతైనా క్రీడారంగాన్ని మించి గ్లామర్ రంగంలో సక్సెస్ ఉండదు. అది తెలిసిన తండ్రిగా ఆయన ఆవేదన అదే అయ్యుండొచ్చు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news