Moviesఆదిప‌రుష్ నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌... విల‌న్ ఎవ‌రో చెప్పేశారు

ఆదిప‌రుష్ నుంచి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… విల‌న్ ఎవ‌రో చెప్పేశారు

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న భారీ ఇతిహాస సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ రానుంద‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ముందుగానే తెలిపారు. ఈ రోజు ఉద‌యం 7.11 గంట‌ల‌కు ఈ అప్‌డేట్ ఏంట‌న్న‌ది రివీల్ చేస్తాన‌ని నిన్నే చెప్పారు. ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమా నుంచి ఏం అప్‌డేట్ వ‌స్తుందా ? అని ఎంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ముందుగా చెప్పిన‌ట్టుగానే ఓం రౌత్ ఈ క్రేజీ అప్‌డేట్‌తో ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ ఫ్యీజులు ఎగ‌ర‌గొట్టేశాడు.

Image

తాను చెప్పిన టైంకే స‌రిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ ను రివీల్ చేశారు. “7000 వేల సంవత్సరాల కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భ‌వించాడు” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే ఈ సినిమాలో రావ‌ణ పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే అనిపిస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో మెయిన్ విల‌న్‌గా బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

 

ఇప్పుడు ఓం రౌత్ ఈ ట్వీట్‌ను సైఫ్‌కు కూడా ట్యాగ్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తే సైఫ్ ను లంకేశునిగా చూపించ‌నున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పారు. సో ప్ర‌భాస్‌ను ఢీ కొట్టే విల‌న్‌గా సైఫ్ పేరు ఖ‌రారైంద‌నే అనుకోవాలి. ఇక ఈ భారీ సినిమాను ద‌ర్శ‌కుడు ఓం రౌత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో 3డి లో తెరకెక్కించనున్నారు. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news