Moviesకేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ గురించి తెలుసా...

కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ గురించి తెలుసా…

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. క‌న్న‌డ నాట ఇప్పుడు అత‌డో సూప‌ర్ స్టార్ యావ‌త్ భార‌త‌దేశం ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వ‌స్తుందా ? అని ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. క‌న్న‌డ సినిమా చ‌రిత్ర‌లోనే కేజీఎఫ్ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇక య‌శ్ ఇంట్లో తాజాగా ఓ శుభ‌కార్యం జ‌రిగింది. య‌శ్ – రాధికా పండిట్ దంప‌తుల‌కు ఇటీవ‌ల ఓ కుమారుడు జ‌న్మించాడు. ఈ కుమారుడికి య‌శ్ దంప‌తులు య‌థ‌ర్వ య‌ష్ అని పేరు పెట్టుకున్నారు.

ఇక వీరికి ఇంత‌కు ముందే ఐరా అనే పాప కూడా ఉంది. త‌న స‌హ‌చర న‌టి అయిన రాధికా పండిట్‌ను ప్రేమించిన య‌శ్ 2016లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముందు పాప ఐరా జ‌న్మించ‌గా, ఆ త‌ర్వాత బాబు పుట్టాడు. వాస్త‌వానికి ఎప్పుడో కుమారుడికి నామ‌క‌ర‌ణం చేయాల‌ని అనుకున్నా క‌రోనా కార‌ణంగా రెండు మూడు నెల‌లు ఆగి ఇప్పుడు పేరు పెట్టారు.

య‌శ్ తన భార్య కొడుకుతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ యష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక య‌శ్ అభిమానులు మా జూనియ‌ర్ రాఖీ భాయ్ అని య‌శ్ కొడుక్కి ముద్దుగా కామెంట్లు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news