Gossipsనానీ అక్క‌గా ఎన్టీఆర్ హీరోయిన్‌..!

నానీ అక్క‌గా ఎన్టీఆర్ హీరోయిన్‌..!

ఒక‌ప్పుడు తెలుగులో వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన ఇలియానా ఇప్పుడు ఛాన్సులు లేక విల‌విల్లాడుతోంది. అస‌లు ఇలియాకు ఒక్క ఛాన్స్ రావ‌డ‌మే గ‌గ‌నం అయ్యింది. తెలుగులో టాప్ హీరోయిన్గా ఉన్న టైంలోనే ఆమె బాలీవుడ్‌లో వెలిగిపోవాల‌ని అక్క‌డ‌కు జంప్ చేసేసింది. ఆ త‌ర్వాత అక్క‌డ క్లిక్ కాలేదు. త‌ర్వాత టాలీవుడ్‌కు తిరిగి వ‌చ్చినా అప్ప‌టికే ఇక్క‌డ క‌ర్ర హీరోయిన్ల పోటీలో ఆమె నిల‌దొక్క‌కోలేక‌పోయింది. ఇలియానా టాలీవుడ్ కెరీర్ ఆమె చేజేతులా నాశ‌నం చేసుకుంది.

I had a careless attitude towards my career, says Ileana | Ileana D'Cruz|  arts| culture and entertainment

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆమెను మీడియం రేంజ్ హీరోలు కూడా తీసుకునేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఆమెకు చివ‌ర‌గా వ‌చ్చిన పెద్ద సినిమా ఎన్టీఆర్ శ‌క్తి. ఎన్టీఆర్‌తోనే ఆమె రాఖీ, శ‌క్తి సినిమాల్లో న‌టించింది. ఇదిలా ఉంటే నేచుర‌ల్ స్టార్ నాని త‌ర్వాత సినిమాలో ఆమెను తీసుకున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అది కూడా హీరోయిన్ కాదు సుమా… హీరో అక్క పాత్రలో… అంటే నానికి అక్కగా ఇలియానా న‌టిస్తుంద‌న్న‌మాట‌.

Ileana D'Cruz: I cherish what I had with Andrew and look back at it with a  smile | Hindi Movie News - Times of India

ఇక నాని తాజా చిత్రం వి ఓటీటీలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని టక్ జగదీష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డ‌గా.. తిరిగి త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుందని అంటున్నారు. షూటింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే ఇలియానా పాల్గొనే సీన్ల‌ను షూట్ చేస్తారు. మ‌రి ఇలియానా చివ‌ర‌కు అక్క, వ‌దిన పాత్ర‌ల్లో అయినా కుదురుకుంటుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news