Moviesబిగ్‌బాస్ ఫ్యాన్స్ ఏం షాక్‌లే.. ఈ క్రేజీ క‌ఫుల్ అవుట్‌..!

బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఏం షాక్‌లే.. ఈ క్రేజీ క‌ఫుల్ అవుట్‌..!

తెలుగు బిగ్‌బాస్ మ‌రో నాలుగు రోజుల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. స్టార్ మా ఛానెల్‌తో పాటు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా బిగ్‌బాస్ వార్త‌ల ట్రెండింగ్ న్యూసే క‌నిపిస్తోంది. అయితే బిగ్ బాస్ ప్రారంభ స‌మ‌యంలో బిగ్‌బాస్ కోసం ఎంతో ఆతృత‌తో ఉన్న ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. కొద్ది రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి డాన్స్ మాస్టర్ రఘు, ఆయన భార్య సింగర్ ప్రణవి ఉంటారంటూ వార్తలు వచ్చాయి. దీంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగిపోయారు.

అయితే వీరి ఆశ‌ల‌కు స‌డెన్ షాక్ త‌గిలింది. వీరు చివ‌ర్లో బిగ్‌బాస్ షోలోకి వెళ్లేందుకు నో చెప్పార‌ని తెలుస్తోంది. స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు జంట‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ల‌డం రిస్కే అని చెప్ప‌డంతో వీరు చివ‌ర్లో డ్రాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ వెళ్లిన వాళ్లంతా కెరీర్ ప‌రంగా పెద్ద‌గా లాభ‌ప‌డిందేమి లేద‌ని.. ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలంలో పెద్ద రిస్కే అని సన్నిహితులు చెప్ప‌డంతో ఆఖ‌రు నిమిషంలో ఈ జంట డ్రాప్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే నిజం అయితే ఈసారి హౌస్ లో స్టార్ కపుల్ లేనట్లే. గత సీజన్ లో వరుణ్.. వితికాలు సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ సారి క‌ఫుల్స్ లేకుండానే బిగ్ బాస్ చూడాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబ‌ర్ 6వ తేదీ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈ షో ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news