Moviesహీరో విశాల్ పెళ్లి... ఆ క్రేజీ లేడీతోనే... !

హీరో విశాల్ పెళ్లి… ఆ క్రేజీ లేడీతోనే… !

కోలీవుడ్ హీరో విశాల్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్ అంటే మ‌న తెలుగు వాడు అయిన న‌ల్ల‌న‌య్య విశాల్ కాదు.. విష్ణు విశాల్‌. భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ణి గుత్తా జ్వాల విష్ణు విశాల్ కొద్ది రోజులుగా ఫుల్లుగా డేటింగ్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు త‌మ బంధంలో మ‌రో అడుగు ముందుకు వేశార‌ట‌. ఈ రోజు జ్వాల పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇద్ద‌రూ ఉంగ‌రాలు మార్చుకున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని విష్ణు విశాల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

 

హ్యాపీ బ‌ర్త్ డే గుత్తా జ్వాల‌. కొత్త ప్ర‌యాణం ప్రారంభిద్దాం.. మంచి భ‌విష్య‌త్తు కోసం.. మ‌న ఆర్య‌న్ కోసం.. మ‌న కుటుంబాల కోసం…. మ‌న స్నేహితుల కోసం పాజిటివ్‌గా ఉందాం.. మీ అంద‌రి ఆశీస్సులు కావాలి. అర్ధ‌రాత్రి ఉంగరాన్ని అరైంజ్ చేసిన బంస‌త్‌జైన్‌కు థ్యాంక్యు అంటూ కామెంట్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ఫొటోల‌ను కూడా విష్ణు విశాల్ షేర్ చేశాడు. ఈ ట్వీట్ గుత్తా జ్వాల రీ ట్వీట్ చేశారు.  ఇక వీరు దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన వెంట‌నే వివాహం చేసుకోవాల‌ని చూస్తున్నారు. ఇక విశాల్ వ‌రుస సినిమాల‌తో ముందుకు వెళుతుంటే.. గుత్తా జ్వాల బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ప్రారంభించింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news