Newsగుడ్డి ప్రేమ‌: మ‌న‌వ‌రాలి కోసం వెళ్లి అల్లుడినే పెళ్లాడిన అత్త‌

గుడ్డి ప్రేమ‌: మ‌న‌వ‌రాలి కోసం వెళ్లి అల్లుడినే పెళ్లాడిన అత్త‌

ప్రేమ గుడ్డిది.. ఇది ఎప్పుడు ఎవ‌రిలో ఎలా పుడుతుంతో తెలియ‌దు అన‌న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఓ మ‌హిళ ఓ వ్య‌క్తిని ప్రేమించి అత‌డి ద్వారా ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకునేందుకు ఆమె త‌ల్లి కూడా ఓకే చెప్పింది. ఆ తల్లి కూడా వైభ‌వంగా త‌న కూతురు పెళ్లి చేసింది. పెళ్లయ్యే సమయానికి కూతురికి ఓ పాప కూడా ఉంది. అక్క‌డి వ‌ర‌కు క‌థ బాగానే న‌డిచింది. పెళ్లి త‌ర్వాత త‌న కూతురు, అల్లుడికి హ‌నీమూన్ ప్లాన్ చేసింది.

అయితే వారికి చిన్న పాప ఉండ‌డంతో ఆ పాప ఆల‌న పాల‌నా చూసేందుకు ఆ త‌ల్లి కూడా ఆ దంప‌తుల‌తో పాటు హానీమూన్‌కు వెళ్లింది. అక్క‌డ మ‌న‌వ‌రాలిని ఆడిస్తూనే అల్లుడితో చ‌నువు పెర‌గ‌డం.. చివ‌ర‌కు అది ప్రేమ‌గా మారి అక్ర‌మ‌ సంబంధానికి దారితీయ‌డం జ‌రిగింది. చివ‌ర‌కు ఎవ్వ‌రూ ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. ఇక హ‌నీమూన్ నుంచి తిరిగి వ‌చ్చాక కూడా వీరు క‌ళ్లుగ‌ప్పి ఆ అక్ర‌మ సంబంధం కొన‌సాగించారు. కొన్నాళ్ల‌కు అత్త కూడా అల్లుడి వ‌ల్ల గ‌ర్భ‌వ‌తి అయ్యింది.

దీంతో షాక్ తిన్న కూతురు త‌న త‌ల్లి గ‌ర్భానికి త‌న భ‌ర్తే కార‌ణం అన్న విష‌యం తెలుసుకుంది. ప్రేమించిన భర్త, ఎంతగానో నమ్మిన తల్లి తనను మోసం చేశారని, ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ మహిళ వాపోయింది. ఇప్పుడు ఆ కూతురు బాధ‌లు అన్నీ ఇన్నీ కావు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news