Moviesజ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఫ్యామిలీతో బ‌న్నీ ఎంజాయ్‌.. ఎక్క‌డో తెలుసా..

జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఫ్యామిలీతో బ‌న్నీ ఎంజాయ్‌.. ఎక్క‌డో తెలుసా..

ప్ర‌ముఖ సినిమా హీరో, టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ శనివారం ఫ్యామిలీతో స‌హా జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఎంజాయ్ చేశాడు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కుంతాల జ‌ల‌పాతాన్ని అల్లు అర్జున్ త‌న కుటుంబంతో స‌హా సంద‌ర్శించాడు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి బ‌న్నీతో పాటు ఆయ‌న కుటుంబానికి వివ‌రించారు.

బ‌న్నీ కుటుంబం అక్క‌డ జాలువారుతోన్న జ‌ల‌పాతాల అందాల‌ను చాలా సేపు వీక్షించ‌డంతో పాటు ఎంజాయ్ చేశారు. అనంత‌రం బ‌న్నీ ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం శివారులో ఉన్న హ‌రిత‌వ‌నం స‌ఫారీలో తిరుగుతూ అందాలు వీక్షించ‌డంతో పాటు మొక్క‌లు నాటారు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news