Moviesబిగ్‌బ‌స్‌లో బిగ్ ట్విస్ట్‌... హౌస్‌లో అదిరిపోయే సీన్ ఇదే..

బిగ్‌బ‌స్‌లో బిగ్ ట్విస్ట్‌… హౌస్‌లో అదిరిపోయే సీన్ ఇదే..

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ వరుస సీజన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తాజాగా నాలుగో సీజ‌న్ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌గా ఇప్ప‌టికే వైల్డ్ కార్డుతో సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల‌లో చాలా మంది పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లు కాద‌న్న టాక్ వ‌స్తోంది. దీంతో షో నిర్వాహ‌కులు టీఆర్పీల‌ను పెంచేందుకు.. షోను మ‌రింత ఆస‌క్తిగా మార్చేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీ లతో కొత్త కంటెస్టెంట్ లను దింపుతున్నారు.

 

ఈరోజుల్లో సినిమాతో పాపుల‌ర్ అయిన సాయి లోప‌ల‌కు ఎంట్రీ ఇవ్వ‌గా.. ఇప్పుడు తాజా ప్రోమోను బ‌ట్టి చూస్తే మ‌రో క‌మెడియ‌న్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్రోమోల‌ను బ‌ట్టి చూస్తే అకస్మాత్తుగా లోపలి వచ్చిన ఆ వ్యక్తి తనను తాను జోకర్ గా చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడు. అత‌డు జబర్దస్త్ అవినాష్ అని తెలుస్తోంది. అయితే ముక్కు అవినాషే లోప‌ల‌కు ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా ?  లేదా ఎవ‌రైనా లోప‌ల‌కు వ‌చ్చారా ? అన్న‌ది నేడు తేలిపోనుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news