Moviesబిగ్ షాక్‌... బిగ్‌బాస్ నుంచి గంగ‌వ్వ అవుట్‌..!

బిగ్ షాక్‌… బిగ్‌బాస్ నుంచి గంగ‌వ్వ అవుట్‌..!

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ విజ‌య‌వంతంగా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీజ‌న్లో ఈ షోకు అతి పెద్ద స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గంగ‌వ్వ‌. యూట్యూబ్‌లో దుమ్ము రేపిన గంగ‌వ్వ‌కు బ‌య‌ట విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డంతో హౌస్‌లో కూడా ఆమె అన్ని సంచ‌ల‌నాలే చేస్తుంద‌న్న టాక్ వ‌చ్చింది. ఆమెది మిగిలిన కంటెస్టెంట్ల‌తో పోలిస్తే పెద్ద వ‌య‌స్సు. అయితే ఆమె త‌న కంటే చిన్న వాళ్లు అయిన కంటెస్టెంట్ల‌తో అంత‌గా స‌ర్దుకోలేక‌పోతున్నారు.

 

ఆమెను మిగిలిన యంగ్ కంటెస్టెంట్లు కూడా ఓ కంటెస్టెంట్‌గా కంటే ఓ స్పెష‌ల్ గెస్ట్‌లా చూస్తున్నారు. ఇక గంగ‌వ్వ కూడా తొలి వారంలో తొలి రెండు మూడు రోజుల్లో ఉన్నంత హుషారుతో అయితే ఉండ‌డం లేదు. ఆమె చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఆమెకు ఉన్న స్క్రీన్ ప్ర‌జెన్సీ కూడా చాలా త‌క్కువే. ఆమెను వీలైన‌న్ని ఎక్కువ రోజులు హౌస్‌లో ఉంచాల‌ని బిగ్ షో నిర్వాహ‌కులు చూస్తున్నా ఆమె మాత్రం బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని ఉన్న‌ట్టు చెపుతోంది.

 

తొలివారంలో ఆమె ఎలిమినేష‌న్లో ఉంటే ఏకంగా 50 శాతం ఓట్లు ప‌డ‌డంతో అంద‌రికి దిమ్మ తిరిగింది. అయితే రెండో వారంలో ఆమె నిరాస‌క్త‌తో ఉండ‌డంతో తొలి వారంలో ప‌డిన ఓట్ల‌తో పోలిస్తే చాలా త‌క్కువ ఓట్లే ప‌డ్డాయ‌ని… ఇవి స‌గానికి స‌గం ప‌డిపోయాయ‌ని అంటున్నారు. దీంతో ఆమె ఈవారం కాకపోయినా వచ్చేవారం అయినా వెళ్ళిపోతుంది అనిపిస్తోంది. గంగ‌వ్వ షో నుంచి ముందుగా బ‌య‌ట‌కు వెళితే కాస్త షాకే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news