Moviesబాల‌య్య - బోయ‌పాటి BB3 కేక‌లు పెట్టించే అప్‌డేట్‌

బాల‌య్య – బోయ‌పాటి BB3 కేక‌లు పెట్టించే అప్‌డేట్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న బీబీ 3 సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ అంటే లెజెండ్‌, సింహా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లే సినిమా ల‌వ‌ర్స్‌కు గుర్తుకు వ‌స్తాయి. ఇప్పుడు ఈ కాంబోలో వ‌స్తోన్న ఈ మూడో సినిమా త‌ప్ప‌కుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడుతుంద‌న్న అంచ‌నాలు ఇటు సినీ అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోనూ ఉన్నాయి. ఇక బాల‌య్య పుట్టిన రోజు కానుక‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు ఒక్క‌సారిగా తారాస్థాయికి చేరుకున్నాయి.

BB3 Teaser: Nandamuri Balakrishna packs a powerful punch in the  high-voltage actioner | Telugu Movie News - Times of India

బాల‌య్య తెల్ల పంచె క‌ట్టుతో విల‌న్‌కు వార్నింగ్ ఇస్తూ చెప్పే డైలాగ్ మాస్ యాక్ష‌న్ ప్రియుల‌కు మంచి ఊపు ఇచ్చింది. ఈ టీజ‌ర్‌తోనే ఈ సినిమాలో కావాల్సినంత యాక్ష‌న్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించ‌నున్నారు. సీనియ‌ర్ బాల‌య్య ప‌క్క‌న సీనియ‌ర్ హీరోయిన్ మీనా పేరు దాదాపు ఖ‌రారైంద‌ని అంటున్నారు. ఇక రెండో బాల‌య్య ప‌క్క‌న అంజ‌లి, శ్రేయ పేర్లు వినిపిస్తున్నాయి.

BB3: First look of Nandamuri Balakrishna's new film to be unveiled on his  birthday eve - Movies News

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ బ‌జ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ బీబీ3కు మ్యూజిక్ ఇస్తోన్న థ‌మ‌న్ అన్ని పాట‌ల కంపోజింగ్ పూర్తి చేసేశాడ‌ట‌. ఆల్బ‌మ్‌లోని ఆరు పాట‌ల్లో ప్ర‌తి పాటా అదిరిపోయే రేంజ్‌లో వ‌చ్చింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు. గ‌తంలో బాల‌య్య – బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాల్లోనూ ఆల్బ‌మ్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఈ హ్యాట్రిక్ మూవీ ఆల్బ‌మ్ కూడా అంతే రేంజ్‌లో ఉండాల‌ని చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news