Gossipsఆదిపురుష్ నుంచి ఆ న్యూస్ పెద్ద డిజప్పాయింటే

ఆదిపురుష్ నుంచి ఆ న్యూస్ పెద్ద డిజప్పాయింటే

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్రభాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెపుతున్నాడు. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న రాధేశ్యామ్‌, ఆ వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సైన్స్‌ఫిక్ష‌న్ సినిమా, ఆ వెంట‌నే ఆదిపురుష్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాల‌కు ఓకే చెపుతున్నాడు. ఇక రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమా గురించి ఇప్పుడు దేశం అంతా చ‌ర్చించుకుంటోంది. బాహుబ‌లి 1, 2 సినిమాల త‌ర్వాత సాహో కూడా సౌత్‌లో ప్లాప్ అయినా బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ప్ర‌భాస్ సినిమా అంటే మామూలుగా అంచ‌నాలు లేవు.

Saif Ali Khan To Play 'Intelligent Demon' Lankesh In Prabhas Starrer  Adipurush! View Poster - The News Pit

ఇదిలా ఉంటే ఈ సినిమాలో 7 వేల సంవ‌త్స‌రాల క్రితం ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ అవ‌త‌రించాడు అంటూ లంకేశ్ రోల్‌ను ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రివీల్ చేనిస సంగ‌తి తెలిసిందే. ఈ రోల్‌లో సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తున్నాడంటూ చెప్పారు. సైఫ్ ఆలీఖాన్ లంకేశ్‌గా ప్ర‌భాస్‌ను ఢీ కొట్టే పాత్ర‌లో చేయ‌డం పెద్ద స‌ర్‌ప్రైజే అని చెప్పాలి. అయితే కొంద‌రు మాత్రం ఈ విష‌యంలో డిజ‌ప్పాయింట్ అయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.

Adipurush: Saif Ali Khan plays Lankesh, the world's most intelligent demon  in Prabhas starrer. See poster - bollywood - Hindustan Times

చాలా మంది ఈ రోల్లో హృతిక్ రోష‌న్‌ను ఊహించుకున్నారు. మేక‌ర్స్ మాత్రం సైఫ్ పేరు ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు. నార్త్‌లో సైఫ్ కంటే హృతిక్‌కే క్రేజ్ ఎక్కువ‌. ఎక్కువమంది మాత్రం లంకేశ్‌గా హృతిక్ రోషన్ పేరు ప్ర‌క‌టిస్తారు అనుకోవ‌డంతో వారు కాస్త డిజప్పాయింట్‌కు గుర‌య్యార‌ట‌.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా సీత పాత్రలో నటించే హీరోయిన్ ని ఫైనల్ చేయ‌నున్నారు. కైరా అద్వానీ పేరు ఖ‌రారు కావొచ్చ‌ని స‌మాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news