GossipsV సినిమా స్టోరీ లీక్‌... ఆ రెండు హైలెట్స్‌తో ఫ్యీజులు ఎగ‌రాల్సిందే...!

V సినిమా స్టోరీ లీక్‌… ఆ రెండు హైలెట్స్‌తో ఫ్యీజులు ఎగ‌రాల్సిందే…!

నేచురల్ స్టార్ నాని న‌టించిన వీ సినిమాను దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. అప్పుడెప్పుడో మార్చి 25న రావాల్సిన ఈ సినిమా ప‌లుసార్లు వాయిదాలు ప‌డింది. అయినా కరోనా త‌గ్గ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. నాని కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 25వ సినిమాగా తెర‌కెక్కిన వి సినిమాను సెప్టెంబ‌ర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

ఇక మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో నానితో పాటు మ‌రో హీరో సుధీర్‌బాబు కూడా న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఇప్ప‌టికే లీక్ అయ్యింది. ఇక ఇది ఒక రివేంజ్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా కథ ఇదే అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే నాని ఓ సాధార‌ణ వ్య‌క్తి… ఆయ‌న భార్య అయిన అదితి రావు హైద‌రీని కొంద‌రు మ‌ర్డ‌ర్ చేస్తారు.

ఈ క్ర‌మంలోనే త‌న భార్య చావుకు కార‌ణ‌మైన వారిని క‌నుగొనే క్ర‌మంలో ఒక్కొక్క‌రిని చంపుతూ పోతుంటాడు. ప్ర‌తి మ‌ర్డ‌ర్ ద‌గ్గ‌ర వీ అనే అక్ష‌రం వ‌దిలి వెళుతుంటాడు. ఈ కేసును ఇన్వెస్ట్‌గేష‌న్ చేసేందుకు ఆఫీస‌ర్ సుధీర్‌బాబు రంగంలోకి దిగుతాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎత్తులు, పై ఎత్తుల‌తో జ‌రిగే వారే వీ సినిమా అని తెలుస్తోంది. చాలా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌తో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. ఇక సినిమా స్టోరీ లైన్ సింపుల్‌గా ఉన్నా… ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర స్క్రీన్ ప్లేతో సినిమాను న‌డిపించాడ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news