బ్రేకింగ్‌: సుశాంత్ ఇంట్లో కీల‌క సాక్ష్యాలు

దివంగ‌త న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ కేసులో తవ్వేకొద్ది కీల‌క సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని కీలక ఆధారాలు సీబీఐ ప్ర‌త్యేక బృందానికి ద‌ర్యాప్తు బృందానికి ముంబై పోలీసులు శుక్ర‌వారం అంద‌జేశారు. సీహెచ్ఐ బృందం బాంద్రా పోలీస్‌స్టేష‌న్‌కు ఎస్‌హెచ్ఓను కలిసేందుకు సాక్ష్యాల‌ను సేక‌రించ‌డానికి చేరుకుంది. ఇక ఈ కేసులో ముంబై పోలీసులు మొత్తం 56 స్టేట్‌మెంట్లు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే శ‌వ పంచ‌నామా నివేదిక‌ల‌తో పాటు ఫోరెన్సిక్ నివేదిక‌ను కూడా ఈ రోజు సీబీఐకు అంద‌జేయ‌నున్నారు.

 

ఇక సుశాంత్‌ మూడు మొబైల్ ఫోన్లు మరియు లాప్ టాప్ కూడా సిట్ కు ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. సుశాంత్ శ‌రీరం వేలాడుతున్న‌ప్పుడు అత‌డు ధ‌రించిన బ‌ట్ట‌లు, అత‌డి మంచం మ‌ద ఉన్న దుప్ప‌టి, బెడ్ షీట్‌, బాంద్రా పోలీసుల కేసు డైరీ, స్పాట్ ఫోరెన్సిక్ నివేదిక, అత‌డి ఫోన్ కాల్స్ లిస్ట్‌.. చివ‌ర‌గా అత‌డు ఎవ‌రెవ‌రితో మాట్లాడాడ‌న్న నివేదిక‌ల‌తో పాటు జూన్ 13 నుండి జూన్ 14 వరకు భవనం యొక్క సిసిటివి రికార్డింగ్ ఉంటాయ‌ని తెలుస్తోంది.

Leave a comment