Moviesరియా చక్రవర్తి - మహేష్ భట్ చాటింగ్... సీక్రెట్ గుట్టు ర‌ట్టు...!

రియా చక్రవర్తి – మహేష్ భట్ చాటింగ్… సీక్రెట్ గుట్టు ర‌ట్టు…!

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అత‌డి మ‌ర‌ణం గురించి ఎప్ప‌టిక‌ప్పుడే ఏదో ఒక సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా అత‌డి ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి, దర్శకనిర్మాత మహేశ్​భట్​లకు సంబంధించిన వాట్సప్​ చాటింగ్​ అంటూ సోషల్​మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్​ అవుతున్నాయి. రియా తాను సుశాంత్‌ను వ‌దిలిన విష‌యాన్ని బ‌ట్‌కు చెప్పిన‌ట్టు ఆ సందేశాలు చెపుతున్నాయి.

riya and mahesh chat

వీరి ప్రేమ వ్య‌వ‌హారంలో హీరోయిన్ రియా తండ్రి ఆన్ హ్యాపీగా ఉన్నార‌ని.. మహేశ్​భట్​ చేసిన చాటింగ్​ ద్వారా తెలుస్తోంది. అదే విధంగా సుశాంత్​కు వ్యతిరేకంగా దర్శకుడు హెచ్చరించాడని కూడా ఆ మెసేజ్‌లు చెపుతున్నాయి. ఈ మెసేజ్‌లు చూస్తుంటే రియా ఆనందంగా ఉన్న‌ట్టు తెలుస్తుండ‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. మహేశ్​ భట్​ను ఉద్దేశిస్తూ..’ఐ లవ్​యూ మై బెస్ట్​ మ్యాన్​. మీరు గర్వించే విధంగా చేస్తా’ అని రియా మెసేజ్ చేసింది. ఇక సుశాంత్ రియాకు దూరం కావ‌డం వెన‌క మ‌హేష్ – రియా మ‌ధ్య ఎఫైర్ ఉంద‌న్న పుకార్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news