Politicsచివరికి భారతీయులు సాధించారు...! దేశభక్తిలో ఇది పీక్స్ అంతే

చివరికి భారతీయులు సాధించారు…! దేశభక్తిలో ఇది పీక్స్ అంతే

భార‌తీయులు మ‌రోసారి దేశ‌భ‌క్తిలో త‌మ‌కు తామే సాటి అని చాటుకున్నారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్ లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. అయితే ఐపీఎల్ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీకి చైనా లీగ్‌కు కంపెనీ స్పాన్స‌ర్ షిప్ ఏంట‌న్న విమ‌ర్శలు వ‌చ్చాయి. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెడింగ్ న‌డుస్తోంది. చివ‌ర‌కు తాము ఐపీఎల్‌నే బాయ్‌కాట్ చేస్తామ‌ని కూడా కామెంట్లు పెట్టారు. దీంతో వివో దిగి వ‌చ్చింది. చివ‌ర‌కు ఐపీఎల్ నుంచి గౌర‌వంగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

 

ప్ర‌స్తుతం చైనా – భార‌త్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే చైనాకు చెందిన మొబైల్ సంస్థ వివో ఐపీఎల్ స్పాన్స‌ర్ నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. గాల్వాన్ లోయ సంఘ‌ట‌న త‌ర్వాత తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే చైనాకు చెందిన 100 యాప్స్‌ను భార‌త్ నిషేధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో రెండు యాప్స్‌ను కూడా భార‌త్ నిషేధించింది. ఈ క్ర‌మంలోనే వివోను టార్గెట్‌గా చేసుకుని భార‌తీయులు విమ‌ర్శ‌లు చేయ‌డంతో వివో ముందుగానే త‌ప్పుకుంది. అయితే ఇంత భారీ మొత్తంలో ఇప్పుడు ఐపీఎల్‌కు ఎవ‌రు స్పాన్సర్ చేస్తారు ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news