Politicsకరోనా వ్యాక్సిన్ కోసం అన్నీ దేశాల చూపు ఇటువైపే...! భారత్ సత్తా...

కరోనా వ్యాక్సిన్ కోసం అన్నీ దేశాల చూపు ఇటువైపే…! భారత్ సత్తా అలాంటిది మరి

కరోనా వ్యాక్సిన్ , సరఫరాలో ప్రపంచ దేశాలకు కేరాఫ్ఇండియానే అవుతుందని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజ్ చీఫ్ , ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెల్త్ అడ్వైజ‌ర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఇండియన్ కౌన్సి ల్ మెడిక‌ల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏర్పాటు చేసిన వెబ్ కాన్ఫ‌రెన్స్ లో ఆయన మాట్లాడారు. మోడర్నా, ఫైజ‌ర్ కంపెనీల వ్యాక్సిన్ లు అడ్వాన్స్ టెక్నిలిక‌ల్ ట్రయల్స్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. భార‌త్‌కే కాకుండా మొత్తం ప్రపంచమంతటికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని దేశాధినేత‌లు కొనియాడుతున్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు.

 

ఇదిలా ఉండ‌గా ఇదే విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం ప్ర‌పంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా ధ్రువీక‌రించారు. ‘కొవిడ్‌-19: వైరస్‌పై భారత్‌ పోరు’ డాక్యుమెంటరీలో ఆయన తన అభిప్రాయాలను వివరించారు. అత్యధిక జనాభా, పెద్దదేశం, పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి భారత్‌ అతిపెద్ద ఆరోగ్య సవాల్‌ను ఎదుర్కొంటోందని గేట్స్‌ అన్నారు. ‘భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచమంతటికీ వ్యాక్సిన్లు సరఫరా చేయగలవు అంటూ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. అలాగే చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చాలా పెద్దది’ అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ప్రశంసల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.

 

వాస్త‌వానికి ప్ర‌పంచ మొత్తానికి వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయగ‌ల శ‌క్తి సామ‌ర్థ్యాలు భార‌త ఫార్మా రంగానికి ఉంద‌న్న‌ది వాస్త‌వం. భారత్‌లో బయో ఈ, భారత్‌ బయోటెక్‌ కూడా ఉన్నాయి. వారు కరోనా వైరస్‌ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. అయితే, కరోనా ఎంత తీవ్రంగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం పడిపడి ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేద‌నే చెప్పాలి. దేశాలకు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాకు సంబంధించి ఇప్పుడు ఇండియాకు ఉన్న శక్తే కీలకం కాబోతోంది.వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ లో రెగ్యులేటరీ స్టాండ‌ర్ట్స్ తగ్గట్టు ఉండాల్సిందే”అని డొనాల్డ్ ట్రంప్ హెల్త్ అడ్వైజ‌ర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. ఇదిలా ఉండ‌గా మ‌రో రెండు నెల‌ల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ర‌ష్యా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news