Moviesపుష్ప‌లో ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా... ఆ సీన్ ఇదే...!

పుష్ప‌లో ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా… ఆ సీన్ ఇదే…!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బ‌న్నీకి తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది. ఇప్పుడు నాన్ బాహుబ‌లి రికార్డులు అన్నీ కూడా బ‌న్నీ ఖాతాలోనే ఉన్నాయి. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌నుంది.

ఈ సినిమాలో న‌టీన‌టుల్లో కూడా ఎక్కువ మంది నార్త్ ఇండియ‌న్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోని శేషాల‌చం అడ‌వుల్లో ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కంప్లీట్ మాస్ మ‌సాలా ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇక ఈ సినిమాలో ఒకే ఒక్క యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం రు. 6 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌.

ఈ ఫైట్ సీన్ హీరో, విల‌న్ల మ‌ధ్య వ‌స్తుంద‌ని.. ఇందుకోసం అదిరిపోయే సెట్స్ వేస్తున్న‌ట్టు చెపుతున్నారు. ఒక్క యాక్ష‌న్ సీక్వెన్స్ క‌సం రు. 6 కోట్లు అంటే సినిమాకు ఎంత బ‌డ్జెట్ పెడుతున్నారో… ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాలో విల‌న్‌గా ముందుగా కోలీవుడ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని అనుకోగా తాను తర్వాత తప్పుకున్నాడు. దీంతో ఇప్ప‌డు పుష్ప‌లో బ‌న్నీని ఢీ కొట్టే విల‌న్ ఎవ‌రు ? అన్న‌ది స‌స్పెన్స్‌గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news