Moviesఅయ్యో సునీల్‌కు ఉన్న ఆ ఒక్క ఆశ అడియాసే అయ్యిందే..!

అయ్యో సునీల్‌కు ఉన్న ఆ ఒక్క ఆశ అడియాసే అయ్యిందే..!

క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ వ‌రుస ప్లాపుల‌తో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారాడు. ఇక ఇటీవ‌ల సునీల్ వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ర‌వితేజ డిస్కోరాజాలో చివ‌ర్లో విల‌న్‌గా షాక్ ఇచ్చిన సునీల్ ఇప్పుడు క‌ల‌ర్ ఫొటో సినిమాలో ఫుల్ లెంగ్త్ విల‌న్‌గా మెప్పిస్తున్నాడు. ఇక అర‌వింద స‌మేత‌, చిత్ర‌ల‌హ‌రి, అల వైకుంఠ‌పురంలో సినిమాల్లో క‌మెడియ‌న్‌గా చేస్తూనే మ‌రోవైపు విల‌న్‌గా కూడా త‌న స‌త్తా చాటేందుకు త‌గిన అవ‌కాశం కోసం వెయిట్ చేస్తున్నాడు.

Comedian Sunil hospitalised due to severe health issues

ఛాయ్‌బిస్కెట్ సుహాస్‌, యూట్యూబ్ హీరోయిన్ చాందిని చౌద‌రి జంటగా తెర‌కెక్కిన ఈ సినిమాకు సందీప్‌రాజ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో విల‌న్‌గా త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకుని కెర‌ర్‌లో మ‌ళ్లీ బిజీ అవ్వాల‌ని అనుకున్నాడు. అయితే సునీల్ ఆశ‌ల‌కు ముందే బ్రేక్ ప‌డింది. ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయితే ఆ రిజ‌ల్ట్ వేరుగా ఉండేది. కానీ కల‌ర్‌ఫొటోను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ల‌ర్ ఫొటోను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌లేక చివ‌ర‌కు ఓటీటీ మార్గానే నిర్మాత‌లు ఎంచుకున్నారు.

Color Photo Official Teaser || Suhas, Sunil, Chandini Chowdary, Sandeep  Raj, Sai Rajesh - YouTube

అయితే హీరోగా సుహాస్ నటించిన మొదటి సినిమా అవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. అయితే సునీల్ విలన్ గా చేస్తూ ఓటిటిలో రిలీజ్ అవడం మాత్రం ఎవ్వ‌రి కెరీర్‌కు ఇది పెద్ద బూస్ట‌ప్ కాద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాపై సునీల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే ఓటీటీలో రిలీజ్ అవ్వ‌డంతో అవ్వ‌న్నీ అడియాస‌లే అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news