Moviesకోలీవుడ్ ఇస్మార్ట్ శంకర్ అతనేనా..?

కోలీవుడ్ ఇస్మార్ట్ శంకర్ అతనేనా..?

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. టెంపర్ తర్వాత పూరికి తన మార్క్ హిట్ అందించిన ఈ సినిమాతో మళ్లీ అతను ఫాం లోకి వచ్చాడు. రాం సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో సినిమా హిట్ అయ్యింది కాబట్టి తమిళంలో ఈ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ రైట్స్ కొనేసిందని తెలుస్తుంది.

అయితే కోలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్ ఎవరు అంటే సూపర్ స్టార్ రజినికాంత్ అల్లుడు వెర్సటైల్ యాక్టర్ ధనుష్ అని అంటున్నారు. ప్రస్తుతం అసురన్ సినిమా చేస్తున్న ధనుష్ కోలీవుడ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లైన్ విన్న ధనుష్ ఆ రీమేక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అయితే నభా నటేష్ పాత్రలో కొత్త అమ్మాయిని తీసుకునే ఛాన్స్ ఉంది నిధి అగర్వాల్ మాత్రం తమిళంలో కూడా ఉంటుందని అంటున్నారు.

తెలుగులో ఇప్పుడిప్పుడే లైం లైట్ లోకి వస్తున్న నిధి అగర్వాల్ కు కోలీవుడ్ ఇస్మార్ట్ చాన్స్ లక్కీ అని చెప్పొచ్చు. ధనుష్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా రీమేక్ అయితే తమిళ ధనుష్ ఫ్యాన్స్ కు పండుగ అని చెప్పొచ్చు. రాం ఆ పాత్రను అదరగొట్టగా ధనుష్ ఎలా చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ రీమేక్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news