ర‌కుల్‌ను వ‌ద‌ల్లేక‌పోతోన్న యంగ్ డైరెక్ట‌ర్‌..

మన్మధుడు 2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ త్వ‌ర‌లోనే నేచుర‌ల్ స్టార్ నానితో మ‌రో సినిమాకు రెడీ అవుతున్నాడు. మ‌న్మ‌థుడు 2 ఘోరంగా ప్లాప్ అయినా నాని మాత్రం రాహుల్ చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయ్యి మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్‌ – నాని కాంబినేషన్‌ లో సినిమా ఉండబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా త‌న మ‌న్మ‌థుడు 2 సినిమా హీరోయిన్ ర‌కుల్‌నే తీసుకోవాల‌ని రాహుల్ డిసైడ్ అయ్యాడ‌ట‌. మ‌న్మ‌థుడు 2లో ర‌కుల్ పెర్పామెన్స్ కంటే ఆమె బోల్డ్ యాక్టింగ్‌, నాగ్‌తో అదిరిపోయే రొమాన్స్‌, హాట్ హాట్‌గా అందాల ఆర‌బోత‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఆమె ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసేసింది.

అదే టైంలో అంత వ‌య‌స్సు ఉన్న నాగ్‌తో చిన్న పిల్ల‌లా ఉన్న ర‌కుల్ అంత‌గా రెచ్చిపోయి రొమాన్స్ చేయాలా ? అన్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ ర‌కుల్‌ను నానిని రెచ్చ‌గొట్టేందుకు వాడుకోవాల‌ని డిసైడ్ అయ్యాడో ? ఏమోగాని రాహుల్ నాని సినిమాకు కూడా ఆమెనే ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ నాని సినిమాకు స్క్రిప్ట్ తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నాడట.

ఏదేమైనా ర‌కుల్ హాట్ ఇమేజ్ చూశాక రాహుల్ ఆమెను వ‌ద‌ల్లేక‌పోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప్రస్తుతం నాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 13 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a comment