” వైఫ్ & ఐ ” టీజ‌ర్‌… ఇంత ఘాటు కంటెంటా

వేగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్పించిన వైఫ్ సినిమా టీజ‌ర్ తాజాగా రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌లోనే కావాల్సినంత బూతు చూపించారు. చూడ‌డానికి చాలా షాట్లే ఉన్నా అందులో కావాల్సిన‌న్ని అశ్లీల హ‌గ్‌లు, ఎక్స్‌పోజింగ్‌, లిప్‌లాక్ సీన్లతో పాటు కావాల్సినంత మ‌సాలా యాడ్ చేసేశారు.

టైటిల్ మాత్రం చూడ‌డానికి చాలా ప‌ద్ధ‌తిగా పెట్టినా టీజ‌ర్‌లోనే సినిమా మ‌సాలా కంటెంట్తోనే తెర‌కెక్కింద‌న్న విష‌యం స్ప‌ష్టంగా చెప్పేశారు. గ‌తంలో శివాజీ – ప్రితి జంట‌గా ర‌వి చావలి ద‌ర్శ‌క‌త్వంలో వైఫ్ అనే సినిమా తెర‌కెక్కింది. అప్ప‌ట్లోనే ఫ్యామిలీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇప్పుడు మ‌రోసారి అదే టైటిల్ పెట్టుకున్నా కంటెంట్ మాత్రం బూతు కంటెంట్తోనే ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. చివ‌ర్లో టీజ‌ర్‌కు కాస్త ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చినా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బూతుతో లాగించేసి చివ‌ర్లో ఓ చిన్న మెసేజ్ మోఖాన ప‌డేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

Leave a comment