Moviesబన్నీ మూవీ నుంచి రావు రమేష్ ఔట్..!

బన్నీ మూవీ నుంచి రావు రమేష్ ఔట్..!

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకునే వారిలో బన్ని-త్రివిక్రమ్ ఒకరు. వీరి కాంబినేషన్ ఇప్పటికే జులాయి, ‘సన్నాప్‌ సత్యమూర్తి’ సూపర్ హిట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత మరోసారి ఈ కాంబినేష్ అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో సీనియర్ నటి టబూ చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తుంది. అంతే కాదు ఖడ్గం హీరోయిన్ సంగీత కూడా నటిస్తుంది. పాదర్ సెంటిమెంట్ తో ఉన్న ఈ మూవీ త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది.

తాజాగా ఈ మూవీ నుంచి రావు రమేష్ తప్పుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాలో రావు రమేస్ కి ఓ ప్రత్యేక పాత్ర ఉంటుందన్న విషయం తెలిసిందే. అదే విధం అల్లు అర్జున్ తో కూడా రావు రమేష్ కి మంచి కనెక్టివిటీ ఉంది అలాంటపుడు ఈ మూవీ నుంచి ఎందుకు తప్పుకున్నాడన్న విషయంపై హాట్ టాప్ నడుస్తుంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎటువంటి వివాదమూ రావు రమేష్ కు ఆ చిత్రం టీమ్ కు మధ్య జరగలేదు.

కేవలం డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకే తప్పుకున్నారట. ఈ సినిమా కోసం రెండు నెలలు డేట్స్ ఇచ్చారు.ద్ది రోజులు అంటే మ్యానేజ్ చేయచ్చు కానీ బల్క్ డేట్స్ అదీ కాంబినేషన్ లో అంటే కష్టం అని దర్శకుడుతో డిస్కస్ చేసి తప్పుకున్నారట. ఇప్పుడు ఆయన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కు వెళ్లిపోయినట్లు ఫిలిమ్ వర్గల్లో చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news