Moviesఇస్మార్ట్ ఎఫెక్ట్‌.... నభా న‌టేష్ గ‌ట్టిగానే పెంచేసింది

ఇస్మార్ట్ ఎఫెక్ట్‌…. నభా న‌టేష్ గ‌ట్టిగానే పెంచేసింది

క‌న్న‌డ బ్యూటీ న‌భా న‌టేష్ సుధీర్ బాబు నిర్మాత & హీరోగా నటించిన సినిమా ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే తెలుగు కూడా నేర్చుకోవడం నభా నటేష్ గొప్పతనం. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది అమ్మాయిలు తెలుగులో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. కొంత మంది వెండితెరపై చెరిగిపోని ముద్ర వేస్తే.. మరికొందరు రెండు మూడు సినిమాల తరవాత కనుమరుగయ్యారు. ఈ క‌న్న‌డ అందాల రాశికి మొద‌టి సినిమా అంత హిట్ ఇవ్వలేక‌పోయింది.

ఇక తాజాగా `ఇస్మార్ట్ శంక‌ర్‌`లో ఎన‌ర్జిటిక్ రామ్ స‌ర‌స‌న న‌టించేందుకు ఛాన్స్ ల‌భించింది. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ- రామ్ తొలి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాకు ఛార్మీ నిర్మాత‌గా వ‌హించింది. ఫ్లాపుల‌తో ఉన్న వీరంద‌రికి ఇస్మార్ట్ శంక‌ర్ భారీ స్థాయిలో క్రేజ్ తీసుకువ‌చ్చింది. వ‌సూళ్ల ప‌రంగా రెండో వ‌రాంలో కూడా దూసుకుపోతుంది. హైద‌ర‌బాదీ యాస‌తో రామ్‌.. త‌మ అంద‌చందాల‌ను ఒల‌క‌బోస్తూ ఇద్ద‌రు హీరోయిన్లు సినిమాకు ఆక‌ర్ష‌ణ‌గా ఉండ‌డంతో పాటు మాస్ కంటెంట్‌తో సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.

అయితే ఈ సినిమాలో త‌న హాట్ హాట్ అంద‌ల‌తో న‌భా న‌టేష్ వ‌య్యారాలు బాగానే వ‌ల‌క‌బోసింది. త‌న డిమాండ్ పెర‌గ‌డంతో రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగానే పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇస్మార్ శంక‌ర్‌లో ఉన్న కొంత స‌మ‌యానికే అధిక మొత్తంలో తీసుకుంద‌ట‌. ఇక తాజాగా కొత్త సినిమాల‌కు రూ. 25 నుంచి రూ. 40 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచింద‌ట‌. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు సంప్ర‌దించ‌గా రూ. 40 ల‌క్ష‌ల‌కు త‌గ్గేది లేద‌ని తెగేసి చెప్పిన‌ట్టు టాక్‌. ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్‌తో గ‌ట్టిగానే రెమ్యూన‌రేష‌న్ పెంచిన యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ నభా నటేష్ ఏ మాత్రం సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news