ఇస్మార్ట్ శంకర్ బయ్యర్స్ సేఫా.. కాదా..! ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రాం కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కలక్షన్ల సునామి సృష్టిస్తుంది. లాస్ట్ థర్స్ డే రిలీజైన ఈ సినిమా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా దుమ్ముదులిపేస్తుంది. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మొదటి వారమే వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. 17 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో రిలీజైన ఇస్మార్ట్ శంకర్ నాలుగు రోజుల్లోనే 24.12 కోట్లు కలెక్ట్ చేసింది.

పూరి జగన్నాథ్ హిట్ కొడితే ఆ రికార్డుల లెక్క ఇలానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ వారం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు ఏవి లేకపోవడం , ఈ చిత్రానికి ప్లస్ గ మారింది . ఇక ఈ వారాంతానికి బయ్యర్స్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల అంచనా.

ఏరియా వైజ్ ఇస్మార్ట్ శంకర్ కలక్షన్స్ చూస్తే..

నైజాం : 9.41 కోట్లు
సీడెడ్ : 3.69 కోట్లు
విజాగ్ : 2.48 కోట్లు
నెల్లూరు : 0.72 కోట్లు
గుంటూరు : 1.36 కోట్లు
కృష్ణా : 1.33 కోట్లు
వెస్ట్ : 1.06 కోట్లు
ఈస్ట్ : 1.36 కోట్లు

ఏపి/ తెలంగాణా : 21.42 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.40 కోట్లు
ఓవర్సీస్ : 1.30 కోట్లు

వరల్డ్ వైడ్ : 24.12 కోట్లు

Leave a comment