Gossips' గ్యాంగ్‌లీడ‌ర్ ' స్టోరీ లీక్‌... అదే హైలెట్‌

‘ గ్యాంగ్‌లీడ‌ర్ ‘ స్టోరీ లీక్‌… అదే హైలెట్‌

నేచురల్ స్టార్ నాని జెర్సీ వంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో హిట్ కొట్టాక… ఇప్పుడు గ్యాంగ్ లీడర్ టైటిల్ తో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రశంసలు అందుకుంటోంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో స్టోరీ అంతా పెన్సిల్ గ్యాంగ్ చుట్టూనే నడుస్తోంది. తాజాగా ఇండస్ట్రీ లో నడుస్తున్న చర్చ ప్రకారం నాని మరియు ఐదుగురు లేడీ గ్యాంగ్ కలిసి బ్యాంక్ రాబ‌రీ చేస్తారట.

అయితే వీళ్లు యాక్షన్ సన్నివేశాలతో కాకుండా తమ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఈ సినిమాలో బ్యాంకుకు కన్నం వేసే తతంగం అంత ప్రేక్షకులకు మంచి కామెడీ ఇస్తుందట. ఫ‌స్టాఫ్‌లో బ్యాంకుకు క‌న్నం వేయ‌డం ఆ తర్వాత ఏం జరిగింది? అనే దాని చుట్టూ సెకండ్ హాఫ్ తిరుగుతుందని తెలుస్తోంది. ఇంతకుముందు తీసిన సినిమాలకు భిన్నంగా విక్రమ్ కె కుమార్ ఈ సినిమాలో ఎంటర్ టైన్ కి పెద్దపీట వేశాడ‌ని టీజ‌ర్ చెప్పేసింది. ఇదే సినిమాకు హైలెట్ అంటున్నారు.

విక్ర‌మ్ కుమార్ సినిమాల‌న్నీ వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతాయి. కానీ ఈ సినిమా లైన్ అందుకు భిన్నంగా కామెడీతోనే ఉంటుంద‌ట‌. పెన్సిల్ పార్థసారధి పాత్రలో నాని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news