Gossipsఇస్మార్ట్ శంకర్ రామ్ ను సైడ్ చేసేశారా..!

ఇస్మార్ట్ శంకర్ రామ్ ను సైడ్ చేసేశారా..!

టెంపర్ తర్వాత హిట్టు కోసం తపస్సు చేస్తున్న పూరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. పూరి హిట్టు కొడితే ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ సెలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూళ్ల హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే సినిమా సక్సెస్ ను పురస్కరించుకుని సక్సెస్ టూర్లు మొదలుపెట్టాడు పూరి అండ్ టీం. ఆంధ్రాలో ముగించిన ఈ టూర్ త్వరలో తెలంగాణాలో కూడా టూర్ వేస్తారని తెలుస్తుంది.

ఇక ఆదివారం సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. అయితే సినిమా హిట్ కొట్టింది కాబట్టి ఇస్మార్ట్ శంకర్ హిట్ పూర్తి క్రెడిట్ తనదే అన్నట్టు చెప్పుకుంటున్నాడు పూరి. సక్సెస్ టూర్ లో రామ్ కనబడలేదు అంటే ఈ టూర్లంటే రామ్ కు ఇష్టం లేదు కాబోలు అందుకే అతను అటెండ్ అవలేదు అనుకున్నారు కాని సినిమా సక్సెస్ మీట్ లో కూడా రామ్ అబ్సెంట్ అయ్యాడు. తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ ఆ సినిమా సక్సెస్ మీట్ కు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ క్రెడిట్ పూర్తిగా పూరి ఎకౌంట్ లోకి వెళ్లింది. అందుకే రామ్ ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్స్ కు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంతేకాకుండా హిట్టు కొట్టేసరికి పూరి స్టార్ హీరోలను టార్గెట్ చేయడంపై కూడా రామ్ అసంతృప్తిని వ్యక్తపరిచాడని తెలుస్తుంది. మరి పూరి, రామ్ కలిస్తే కాని ఈ రూమర్స్ కు బ్రేక్ పడే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news