Gossipsబాలయ్యను కెలుకుతున్న వర్మ ! మరీ ఇంత ఘాటుగానా ...?

బాలయ్యను కెలుకుతున్న వర్మ ! మరీ ఇంత ఘాటుగానా …?

ఎవరైనా వివాదాలకు దూరంగా ఉంటారు… కోరి ఎవరూ … ఎవరితోనూ.. కయ్యం పెట్టుకోరు. కానీ అందరిలా ఉంటే తన స్పెషలిటీ ఏముంటుంది అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ … వివాదాల దర్శకుడిగా పేరు పొందిన రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పుడూ వివాదాలను వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఆ విధంగానే నందమూరి బాలకృష్ణతో కోరి వివాదం తెచ్చుకునేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. అందుకే ట్విట్టర్ వేదికగా… బాలయ్యను రెచ్చగొడుతున్నాడు వర్మ.

బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కు, వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మధ్య పోటీ ఎక్కువయ్యింది. శుక్రవారం బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్ ఆడియో లాంచ్ జరగబోతోంది. అదే రోజు ఆర్‌జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి సంబంధించిన వెన్నుపోటు పాటను కూడా విడుదల చేస్తున్నారు. కానీ ఇంతలోనే… వర్మ ట్విట్టర్ ద్వారా బాలకృష్ణపై ఘాటుగా ట్వీట్ చేశారు. బాలకృష్ణ తనను ప్రశ్నిస్తున్నట్టుగా మిమిక్రీ చేయించిన వర్మ. బాలకృష్ణ గొంతుతో సంధించిన ప్రశ్నలకు తానే తిరిగి సమాధానం కూడా చెప్పేసుకున్నారు.
1
వర్మ విడుదల చేసిన ఆడియో టేపులో బాలకృష్ణ గొంతు ఇలా ప్రశ్నించింది. “ఓరేయ్ ఆర్‌జీవీ. నా దగ్గర నేనున్నాను, విద్యా బాలన్‌ ఉంది, కల్యాణ్‌ రామ్ ఉన్నాడు, దగ్గుబాటి రానా ఉన్నాడు, సుమంత్ అక్కినేని ఉన్నాడు, నిత్యామీనన్ ఉంది, హన్సిక ఉంది, రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఉంది, శాలిని పాండే ఉంది, ప్రకాశ్‌ రాజ్‌ ఉన్నాడు. మరి నీ సినిమాలో ఏముంది రా?.” అని బాలకృష్ణ ప్రశ్నించినట్టుగా మిమిక్రీ చేయించారు.

బాలకృష్ణ గొంతును మిమిక్రీ చేస్తూ సంధించిన ప్రశ్నలకు వర్మ తన సొంత వాయిస్‌తో సమాధానం ఇచ్చారు. ” సార్‌.. నా దగ్గర నిజం ఉంది. నిజానికి సంబంధించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యదార్థం ఉంది. అది హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌లోని సంఘటనలు అవ్వొచ్చు, ఇంట్లోనూ, వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలు అవ్వొచ్చు.. సార్‌ నిజం నాకన్నా ఎక్కువ మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఇంటల్లుడికి తెలుసు సార్.. కానీ మీరు చెప్పరు కాబట్టి నేను చెప్పాల్సివస్తోంది.

యస్‌. నా దగ్గర మీ సినిమాలో ఉన్న స్టార్స్ లేరు. కానీ మీ సినిమాలో ఉన్న స్టార్స్‌ ఎవ్వరికీ మీ సినిమాలో ఉన్న అబద్దాలు తెలియవు. కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాలో ఉన్న యాక్టర్స్‌ అందరికీ నిజంగా జరిగిన నిజాలు మాత్రమే తెలుసు. సత్యమేవ జయతే. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాట డిసెంబర్‌ 21 సాయంత్రం 4 గంటలకి విడుదల” అంటూ వర్మ అందులో తాను చెప్పాల్సింది అంతా చెప్పేసారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news