షారుఖ్ ఖాన్ ” జీరో ” రివ్యూ & రేటింగ్..

షారుఖ్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జీరో. షారుఖ్ నిర్మించిన ఈ సినిమాలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూదాం.

కథ :

మీరట్ కు చెందిన బౌవా సింగ్ (షారుఖ్ ఖాన్) మరగుజ్జువాడు.. అయితే అతను ఉండే ఏరియాలో అతనంటే అందరికి ఇష్టం. యాక్ట్రెస్ బబితా కుమారిని (కత్రినా కైఫ్)ను ఇష్టపడిన బౌవా సింగ్ ఫిజికల్లీ చాలెజెంద్ అయిన ఆఫియా భిందర్ (అనుష్క శర్మ) ను ప్రేమించేలా చేస్తుంది. ఇంతకీ బౌవా సింగ్ ఎవరిని ప్రేమించాడు. ఆఫియా భిందర్ ఎందుకు అతనికి దూరమవ్వాలనుకుంది. చివరకు బౌవా సింగ్, ఆఫియా భిందర్ ఎలా కలిశారు అన్నది సినిమా కథ.
2
నటీనటుల ప్రతిభ :

మరుగుజ్జు పాత్రలో షారుఖ్ నిజంగా అదరగొట్టాడు. తనలాంటి స్టార్ ఇలాంటి ప్రయోగం చేయడం గొప్ప విషయం. సినిమాలో ప్రతి ఒక్క సీన్ షారుఖ్ కట్టిపడేశాడు. అనుష్క శర్మ కూడా తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. కత్రినా కైఫ్ కూడా అలరించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గమ పనితీరు :

మను ఆనద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు హైలెట్ అంటే కెమెరా వర్క్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కూడా అదరగొట్టారు. షారుఖ్ సినిమాల్లో ఉండే మ్యూజిక్ ఎలా ఉంటుందో జీరోలో అలా ఉంది. ఆనంద్ ఎల్ రాయ్ కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లో షారుఖ్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది.
1
విశ్లేషణ :

షారుఖ్ ఖాన్ ఇదవరకు సినిమాల కన్నా ఈ మూవీలో ఎక్కువ కష్టపడ్డాడని తెలుస్తుంది. తెర మీద ఆయన విశ్వరూపం చూపించారు. సినిమాలో ప్రతి సన్నివేశం బాగుంది. అయితే కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏం లేదు. కాని కథనం మెప్పించింది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సినిమాకు చాలా వెయిట్ తెచ్చిపెట్టింది.

సినిమాలో కత్రినా మెరుపులతో పాటుగా అన్సుహ్క శర్మ మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయి. సినిమాలో షారుఖ్ కూడా వన్ మ్యాన్ షో అన్నట్టుగా చేశాడు. అయితే అక్కడక్కడ సినిమా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. ఫైనల్ గా షారుఖ్ ఫ్యాన్స్ కు జీరో నచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత షారుఖ్ కసితో నటించిన సినిమాగా జీరో వచ్చింది. ఫ్యామిలీ, యూత్ అందరిని కట్టిపడేసే ఎమోషన్స్ ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

షారుఖ్, అనుష్క

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్క స్లో అవడం

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్

బాటం లైన్ :

జీరో షారుఖ్ నట విశ్వరూపం..!

రేటింగ్ : 2.75/5

Leave a comment