Gossipsనాగశౌర్యకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!

నాగశౌర్యకు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..!

నాగ శౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా @నర్తనశాల. సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఈ సినిమా టైటిల్ వాడటానికి కచ్చితంగా నాగశౌర్యకు గట్స్ ఉండాల్సిందే. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో నందమూరి బాలకృష్ణ నాగ శౌర్యకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈమధ్యనే నర్తనశాల సినిమా గురించి తెలుసుకున్న బాలకృష్ణ ఆ సినిమా హీరో నాగశౌర్యతో మాట్లాడారట. టైటిల్ విషయంలో ఆ సినిమ దర్శక నిర్మాతల అనుమతి తీసుకున్నాడా.. సినిమాకు సంబందించిన పెద్ద వాళ్ల అనుమతి పొందాడా లేదా అన్న విషయం అడిగారట. దీనికి నాగ శౌర్య దగ్గర నుండి లేదు కాదు అన్న సమాధానం వచ్చేసరికి నాగ శౌర్యకు వార్నింగ్ ఇచ్చాడట బాలయ్య బాబు.

అయితే యువ హీరో కెరియర్ దెబ్బ తింటుందని భావించి వదిలేశాడట. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దని అన్నాడట. అందుకే ఈమధ్య నాగ శౌర్య ఎన్.టి.ఆర్ పేరుని చెడగొట్టేలా సినిమా ఉండదని మీడియాకు చెప్పాడు. అది బాలయ్య వర్నింగ్ చలవే అంటున్నారు. ఛలో హిట్ తో జోష్ లో ఉన్న నాగశౌర్య నర్తనశాల సినిమాకు నిర్మాతగా బాధ్యత వహిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news