Gossipsరేప్ కేసులో చిక్కుకున్న స్టార్ హీరో తనయుడు..!

రేప్ కేసులో చిక్కుకున్న స్టార్ హీరో తనయుడు..!

బాలీవుడ్ నిన్నటితరం హీరో మిధున్ చక్రవర్తి తన తనయుడి విషయంలో కొత్త చిక్కులు ఎదుర్కుంటున్నారు. బీ టౌన్ లో డిస్కో డ్యాన్స్ లను ఇంట్రడ్యూస్ చేసి బీ, సి సెంటర్స్ లో మిగతా స్టార్స్ కు ధీటుగా క్రేజ్ తెచ్చుకున్న మిధున్ చక్రవర్తి ఇప్పటివరకు తన మీద ఎలాంటి మచ్చ లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు తన కొడుకు మహాక్షయ్ చక్రవర్తి వల్ల తలదించుకోవాల్సి వచ్చింది.

తండ్రి తర్వాత ఆ వారసత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహాక్షయ్. 2008లో జిమ్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే మహాక్షయ్ తనతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడని.. గర్భవతి కూడా అయ్యానని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మహాక్షయ్ మీద ఇలాంటి గొడవ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. తనతో ఇన్నాళ్లు కలిసి ఉండి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్న మహాక్షయ్ మీద మహిళ ఫిర్యాదు చేసింది. మరి ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.

mithun-son-read

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news