Gossipsచేసిన తప్పుకు ప్రియాంక కి నోటీసులు..!

చేసిన తప్పుకు ప్రియాంక కి నోటీసులు..!

బాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా క్రేజ్ సంపాదించిన ప్రియాంకా క్వాంటికో సీరీస్ తో హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది. కొన్నాళ్లుగా ఫారిన్ లోనే ఉంటూ ఈమధ్యనే తన లవర్ తో ఇండియాకు వచ్చిన ప్రియాంకాకు ఊహించని విధంగా ముంబై మునిసిపాలిటీ నుండి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.

ముంబై మున్సిపల్ అధికారుల తనిఖీలలో వాణిజ్య సముదాయంలో అక్రమంగా భవనాలు నిర్మించారు. వాస్తు రీత్యా వాణిజ్య సముదాయంలో బిల్డింగులు కట్టారని తేలింది. ఇందులో ప్రియాంకా చోప్రాకు సంబందించిన భవనం కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించారట. గడువు సమయంలో నోటీసులకు స్పందించకుంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ముంబై మున్సిపల్ అధికారులు.

2013లో ముంబై మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా వీరు సొంతంగా వాణిజ్య సముదాయంలో కట్టడాలు నిర్మించారట. మరి ఈ విషయంపై ప్రియాంకా చోప్రా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news