Gossipsనందమూరి వంశాన్ని నమ్ముకున్న నాగ శౌర్య..!

నందమూరి వంశాన్ని నమ్ముకున్న నాగ శౌర్య..!

యువ హీరోల్లో మంచి జోష్ కనబరుస్తున్న నాగ శౌర్య తన సినిమా టైటిల్స్ విషయంలో నందమూరి హీరోల టైటిల్స్ మీద పడ్డాడు. ఛలో తర్వాత నాగ శౌర్య చేస్తున్న రెండు సినిమాలకు రెండు నందమూరి హీరోల పాత సినిమాల టైటిల్స్ పెట్టడం హాట్ న్యూస్ గా మారింది. అందులో ఒకటి భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుండగా.. మరొకటి తన సొంత బ్యానర్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.
శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా నర్తనశాల. టైటిల్ ను బట్టే ఇది ఎలాంటి సినిమానో అర్ధం చేసుకోవచ్చు. సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే నర్తనశాల మూవీ టైటిల్ తన సినిమాకు వాడేస్తున్నాడు నాగ శౌర్య.
ఇక భవ్య క్రియేషన్స్ లో వస్తున్న సినిమాను రాజా కొలసు డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి టైటిల్ పెట్టారట. బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన నారి నారి నడుమ మురారి సినిమా టైటిల్ ను నాగ శౌర్య వాడేస్తున్నాడు. మరి నందమూరి హీరోల టైటిల్స్ యాదృశ్చికంగా కలిశాయా లేక కావాలని పెట్టుకున్నాడా అన్నది నాగ శౌర్య మాత్రమే చెప్పాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news