Moviesరంగస్థలం హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

రంగస్థలం హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

రాం చరణ్ చిట్టిబాబుగా సర్ ప్రైజ్ చేస్తూ వచ్చిన సినిమా రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలోని చరణ్ నటన గురించి అందరు మాట్లాడుతున్నారు. సినిమాకు మేజర్ హైలెట్ చరణ్ నటనే అని తెలుస్తుంది. ఇక సినిమాకు మరో ప్లస్ పాయింట్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన సినిమాకు అచ్చ తెలుగు అమ్మ పాటలా దేవి చక్కనైన సంగీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించి ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు.

రంగస్థలంలో మరో మేజర్ హైలెట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ. సినిమా చూస్తున్నంత సేపు ఓ మంచి అనుభూతి కలిగేలా చేశాడు కెమెరామన్. ఇక ఆర్ట్ వర్క్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఇవన్ని సినిమాలోని ప్లస్ పాయింట్లుగా చెప్పుకుంటే సినిమాలో మైనస్సులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు.

మొదట సుకుమార్ సినిమాల విషయంలో రన్ టైం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమా కూడా 179 నిమిషాల రన్ టైం తో వచ్చింది. ఇక అక్కడక్కడ కాస్త సెంటిమెంట్ ఎక్కువైందని అనిపిస్తుంది. అయితే 1980 కాలం నాటి కథ కాబట్టి అప్పుడు పరిస్థితులు అలానే ఉండేవని చెప్పొచ్చు.

ఓవరాల్ గా సినిమా రాం చరణ్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు. రంగస్థలం విషయంలో సుకుమార్ ఎక్స్ క్యూషన్ పర్ఫెక్ట్ గా కుదిరిందని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news