Moviesడిటెక్టివ్‌ సక్సెస్‌తో విశాల్‌ సాహసం

డిటెక్టివ్‌ సక్సెస్‌తో విశాల్‌ సాహసం

తమిళ స్టార్‌ హీరో విశాల్‌ తాజాగా డిటెక్టివ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో తెరకెక్కిన ఆ సినిమా తెలుగులో కూడా నిన్న విడుదలైంది. తమిళం మరియు తెలుగులో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో విశాల్‌కు ఈ సినిమా రూపంలో విజయం దక్కడంతో తన తర్వాత సినిమాను వెంటనే తీసుకు వచ్చేందుకు విశాల్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం విశాల్‌ ఇరుంబు తెరై అనే సినిమా తమిళంలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ముఖ్య పాత్రలో నటించడంతో పాటు సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇరుంబు తెరై ను తెలుగు ప్రేక్షకులు ఒక డబ్బింగ్‌ చిత్రంగా కాకుండా డైరెక్ట్‌ సినిమాగా భావించే అవకాశం ఉంది. విశాల్‌ తెలుగు వ్యక్తి అవ్వడంతో పాటు అర్జున్‌కు తెలుగులో ఏ స్థాయి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సమంత నటించిన సినిమా అంటే తెలుగులో అంచనాలు మరియు ఆసక్తి భారీగా ఉంటుంది. అందుకే విశాల్‌ నటిస్తున్న ఆ సినిమా తెలుగులో మంచి ఆధరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

అందుకే సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతున్నా కూడా తెలుగు మరియు తమిళంలో అదే సమయంలో విడుదల చేయాలని విశాల్‌ నిర్ణయించుకున్నాడు. సంక్రాంతికి పవన్‌ అజ్ఞాతవాసి, బాలయ్య జైసింహా సినిమాలతో పాటు పోటీలో విశాల్‌ సినిమా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news