Gossipsమురుగ‌దాస్‌కు ఆ హీరోనే దిక్కా..!

మురుగ‌దాస్‌కు ఆ హీరోనే దిక్కా..!

మురుగుదాస్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌కు స్పైడ‌ర్ సినిమాకు ముందు వ‌ర‌కు చాలా వాల్యూ ఉంది. ఆయనతో సినిమా చెయ్యడానికి అగ్ర హీరోలంతా పోటీలు పడుతుంటారు. అలాంటిది ఇప్పుడిప్పుడే ఆయన మీద నమ్మకం కోల్పొతున్నారు అందరూ ఎందుకంటే భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన స్పైడ‌ర్ సినిమాతో మురుగ‌దాస్ అప కీర్తి మూటగట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది.

మిల్క్ బాయ్ మహేష్ హీరోగా స్పైడర్ అనే సినిమా చేశాడు మురుగుదాస్. సుమారు 100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టించి.. ఓ నాసీర‌కం సినిమా తీసాడంటూ మురుగ‌దాస్.. మ‌హేష్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈయ‌న మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సారి త‌న‌కు క‌లిసొచ్చిన హీరో విజ‌య్ ను న‌మ్ముకుంటున్నాడు మురుగ‌దాస్. త‌మిళ‌నాట విజ‌య్-మురుగ‌దాస్ కాంబినేష‌న్ కు అదిరిపోయే క్రేజ్ ఉంది. వీళ్లిద్ద‌రూ మూడోసారి జోడీ క‌ట్ట‌బోతున్నారు. దీంతో సర్వత్రా సినీ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ స్టార్ట్ అయ్యింది.

తమిళ ఇండ్రస్ట్రీలో ర‌జినీ త‌ర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజ‌య్. గ‌తంలో క‌త్తి.. తుపాకి లాంటి సెన్సేష‌న‌ల్ సినిమాలు ఈ కాంబినేష‌న్ లోనే వ‌చ్చాయి. ఇక ఇప్పుడు మ‌రో కొత్త త‌ర‌హా క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు విజ‌య్-మురుగ‌దాస్. జ‌న‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ప్ర‌స్తుతం మెర్స‌ల్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు విజ‌య్. ఈ కాంబినేష‌న్ లో రాబోయే ఆ మూడో సినిమా ఎలా ఉండ‌బోతుందో  ఎన్ని రికార్డులు సృష్టించ‌బోతుందో అని త‌మిళ‌నాట ఇప్ప‌ట్నుంచే అంచ‌నాలు మొద‌లైపోయాయి. మరి మురుగుదాస్ ఏమి చేస్తాడో చూడాలి విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తాడా లేక మహేష్ ని పడినట్టు అమాంతం కింద పడేస్తాడా అనేది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news