Movies‘ధృవ’ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్.. చరణ్ కెరీర్‌లో రికార్డ్!

‘ధృవ’ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్.. చరణ్ కెరీర్‌లో రికార్డ్!

Ram Charan’s latest movie Dhruva pre release business report has been released by trade analysts. According to their report, this movie has done highest business ever in Cherry’s career.

రామ్ చరణ్ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’పై మొదటినుంచే మంచి అంచనాలు నెలకొనడంతో.. ఇది భారీ స్థాయిలోనే బిజినెస్ చేసింది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు పోటీపడి మరీ ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. దాంతో.. చరణ్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఎక్కువ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ లెక్కలు వెల్లడించాయి.

నిజానికి.. ఈ రిపోర్ట్‌ని ట్రేడ్ నిపుణులు రిలీజ్‌కి వారం రోజుల ముందే వెల్లడిస్తారు. కానీ.. ధృవ విషయంలో అలా జరగలేదు. ఇన్నాళ్లూ ఎందుకు గోప్యంగా ఉంచారో సరైన కారణాలు తెలీదు కానీ.. తాజాగా ఈ మూవీ రిలీజైన సందర్భంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రిపోర్ట్‌ని వెల్లడించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.57.50 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాలవారీగా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. (కోట్లలో)

నైజాం : 12.90
సీడెడ్ : 9.00
నెల్లూరు : 2.10
కృష్ణా+ఈస్ట్+వెస్ట్ : 9.65
గుంటూరు : 4.50
వైజాగ్ : 5.25
ఏపీ+తెలంగాణ : రూ. 43.40 కోట్లు
కర్ణాటక : 6.55
తమిళనాడు : 0.70
యూఎస్ఏ : 5.25
రెస్టాఫ్ ఇండియా+వరల్డ్ : 1.60
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 57.50 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news