ట్విటర్ సాక్షిగా.. ఎన్టీఆర్-బాబీ ప్రాజెక్ట్‌ కన్ఫమ్ అయ్యింది

kalyan ram confirms ntr 27 project with director bobby

Finally, Kalyan Ram confirms NTR’s 27 project with director Bobby. This movie will go on floors very soon. According the filmnagar news, in this film NTR may play dual role again after Adhurs movie.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బాబీ దర్శకత్వంలో చేయనున్నాడని, ఇందుకు సంబంధించి ఈరోజు (09-12-2016) తేదీన అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ.. నందమూరి కళ్యాణ్ రామ్ ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేశాడు. తన తమ్ముడైన ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ 27వ ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌లోనే ఉంటుందని, ఈ మూవీ బాబీ దర్శకత్వంలో ఉండనుందని తెలిపాడు. మొత్తానికి.. ఇన్నాళ్ళూ ఏ వార్తకోసమైతే తారక్ ఫ్యాన్స్ ఎదురుచూశారో, ఆ సమయం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఈ మూవీ ఎప్పుడు ప్రారంభోత్సవం జరుపుకుంటుంది? సెట్స్ మీదకి ఎప్పుడు వెళుతుంది? అన్న విషయాలపై కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలైతే శరవేగంగా జరుగుతున్నాయి. బహుశా హీరోయిన్, ఇతర తారాగణం ఎంపిక చేశాక.. ఈ చిత్రం ప్రారంభిస్తారేమోనని తెలుస్తోంది. అలాగైతే.. వచ్చే నెలలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో.. ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది కానీ ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు. ఒకవేళ అది నిజమే అయితే.. బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం ఖాయమే.

Leave a comment