Gossipsసూపర్ స్టార్ మహేష్.....ఇంకో సూపర్ స్టార్ మహేష్...కేకలు పెట్టిస్తారట!!

సూపర్ స్టార్ మహేష్…..ఇంకో సూపర్ స్టార్ మహేష్…కేకలు పెట్టిస్తారట!!

బ్రహ్మోత్సవం రిజల్ట్ విషయం పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్‌బాబు క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ బోలెడంత మంది సినిమా సెలబ్రిటీసే మహేష్ అందానికి ఫ్లాట్ అవుతూ ఉంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు మహేష్‌బాబులు కనిపిస్తే…ఇద్దరూ కూడా అందంగా కనిపించే క్యారెక్టర్స్ చేస్తే……ఒకరిది స్వచ్ఛమైన పల్లెటూరి అందం…..మరొకరిది సిటీ స్టైలిష్ ఐకాన్ క్యారెక్టర్……ఎలా ఉంది? ఎలా ఉంటుంది? ఐడియా అదిరిపోలా? దట్ ఈజ్ మురుగదాస్.

ఇప్పుడు బయటికి వచ్చిన ఈ డిటెయిల్సే సినిమాపైన పిచ్చ క్రేజ్ తీసుకుని వస్తున్నాయి. మహేష్‌బాబు-మురుగదాస్ సినిమాకి సంబంధించి లేటెస్ట్‌గా లీక్ అయిన కొన్ని పిక్స్ కూడా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణంగా మురుగదాస్ సినిమాలో డ్యూయల్ రోల్ కామన్. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా ఆ రేంజ్ ఫైట్సే ఉంటాయట. రీసెంట్‌గా బాస్కెట్ బాల్ కోర్టులో ఓ రెయిన్ ఫైట్ షూట్ చేశారట. ఆ రష్ మొత్తం అదిరిపోయే రేంజ్‌లో వచ్చిందని చె్ప్తున్నారు. మహేష్ సినిమాకి సంబంధించి ప్రతి విషయం కూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది మరి. ఈ దెబ్బతో తెలుగుతో పాటు తమిళ్, హిందీ మార్కెట్స్‌లో కూడా ఓ రేంజ్ సూపర్ హిట్‌ని కొట్టేలా ఉన్నాడు మన సూపర్ స్టార్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news