Newsపోటి ఉంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం : "ఖైదీ ,శాతకర్ణి...

పోటి ఉంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం : “ఖైదీ ,శాతకర్ణి లపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఆసక్తిని రేపుతున్నాయి. చిరంజీవి అంటే తనకు అభిమానం అని ఇద్దరం చాల క్లోజ్ గా ఉంటాం అని వారి ఇద్దరి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేవు అని చెప్పుకొచ్చాడు.ఎమ్మెల్యే అయ్యాక బిజీగా ఉండడం వలన కలవడం కుదరడం లేదు అని సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండేది తనతోనే అని వేరే ఎవరితోనూ అంత క్లోజ్ గా ఉండను అని కూడా చెప్పాడు. ఎక్కువగా కలవము ఎప్పుడో ఫంక్షన్స్ లో, పార్టీలలోనే తప్ప. ఎక్కడ కుదరదు ఇంతకు ముందు అంటే కలిసే వాళ్ళం ఇప్పుడు టైం కుదరడం లేదు.

ఇక సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలయిన చిరు “ఖైదీ” మరియు తన “శాతకర్ణి” సినిమాలపై స్పందిస్తూ “ఎక్కడ అయినా కాంపిటేషన్ ఉంటేనే మజా ఉంటుంది. చిరంజీవి ఖైదీ నం.150 సోషల్ మూవీ ఇక తన “గౌతమిపుత్ర శాతకర్ణి” హిస్టారికల్ మూవీ, అయితే రెండిటి మధ్య పోటీ ఉండడం సాధారణమైన విషయమే.పోటీ ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెస్తాము. ఇండస్ట్రీకి ఇంతకంటే మంచి ఏమి ఉంటుంది.ఎవరి సినిమా అయినా మంచిగా ఆడడం, ఇటు ప్రేక్షకులను అటు అభిమానులను మెప్పించడమే కదా కావాల్సింది. ఆ మాత్రం పోటీ ఉండాలి. ఇటు సినిమాల్లో అయినా అటు రాజకీయాలలో అయినా. మా ఇద్దరి సినిమాలు చాలా బాగా వచ్చాయి,కలెక్షన్ల పరంగానూ చాల బాగా ఆడుతున్నాయి. ”

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news