Moviesతన కెరియర్ లో ఇష్టం లేకుండా రాజమౌళి తెరకెక్కించిన ఏకైక మూవీ...

తన కెరియర్ లో ఇష్టం లేకుండా రాజమౌళి తెరకెక్కించిన ఏకైక మూవీ ఇదే .. రిజల్ట్ చూసి ఏడ్చేసిన జక్కన్న..!

రాజమౌళి .. ఇండస్ట్రీలో ఓ బడా డైరెక్టర్ కాదు కాదు కాదు ..వన్ అండ్ ఓన్లీ లెజెండరీ డైరెక్టర్ .. చాలా చిన్న ఏజ్ లోని అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేసిన టాలీవుడ్ టాప్ మోస్ట్ దర్శకుడు . అభిమానులు ముద్దుగా పిలుచుకునే జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే రాజమౌళి తన కెరియర్ లో తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అన్ని సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి .

అయితే ప్రతి సినిమాను ఎంతో ఇష్టంగా పకడ్బందీగా ప్లాన్ చేసి తెరకెక్కించే రాజమౌళి తన కెరీర్ లో ఒక సినిమాను మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా టైంపాస్ గా తెరకెక్కించారట . ఆ మూవీ మరేదో కాదు మర్యాద రామన్న . మగధీర సినిమా తర్వాత రాజమౌళి చాలా తక్కువ టైం గ్యాప్ లో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టం లేకుండా ఈ మూవీ ని తెరకెక్కించారట . సలోని హీరోయిన్గా సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది .

కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మి పడేసింది. అయితే ఈ సినిమా విషయంలో తనను తాను తక్కువ అంచనా వేసుకున్నాను అని రిజల్ట్ చూశాక బోరున ఏడ్చేసాడట రాజమౌళి. ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రాజమౌళి లో ఏదో స్పెషల్ టాలెంట్ ఉందని.. ఆయన తీసే సినిమాలు అభిమానులకి విపరీతంగా నచ్చేస్తూ ఉంటాయి అని జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అభిమానుల నాడి పట్టి జక్కన్న సినిమాలు తెరకెక్కిస్తాడు అన్న విషయం అందరికి తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news