Moviesసుకుమార్-చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో మరో స్టార్ హీరో..ఎవరో తెలిస్తే రోమాలు...

సుకుమార్-చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో మరో స్టార్ హీరో..ఎవరో తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకోని డ్యాన్స్ చేస్తాయి..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది . ఒక సినిమాలో నటించి ఆ సినిమాను ఫ్లాప్ చేసుకోవడం కన్నా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటించి ఆ సినిమాను హిట్ చేసుకోవడమే బెటర్ అనే విధంగా ఆలోచిస్తున్నారు మేకర్స్ . మరీ ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల సినిమాలకు ఎక్కువగా ట్రెండ్ కొనసాగుతుంది . ఈ క్రమంలోనే చాలామంది డైరెక్టర్స్ కూడా అలాంటి సినిమాలు తెరకెక్కించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

జనాలు కూడా అలాంటి సినిమాలను లైక్ చేస్తూ ఉండడంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి . అందుకే డైరెక్టర్ కొత్త కొత్త కాంబో సెట్ చేయడానికి చూస్తున్నారు . మరీ ముఖ్యంగా బడా బడా హీరోలు కలిసి సినిమాలో నటిస్తే ఆ సినిమాకి డబుల్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కేస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న చరణ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమా రంగస్థలంకి సీక్వెల్ గా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు . కానీ ఈ సినిమాలో వేరే లెవెల్ లో కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా కోసం చిరంజీవి – చరణ్ అగ్రిమెంట్లపై సైన్ కూడా చేసేసారట. దీంతో ఈ కాంబోపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటన ఎలా ఉంటుందో చూసాం.. ఇప్పుడు చిరంజీవి నటన కూడా చూడబోతున్నాం ..ఇక అభిమానులకి గూస్ బంప్స్ మోతే అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news