Moviesపుష్పగాడి చెల్లిగా కనిపించబోతున్న స్టార్ హీరోయిన్.. సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!

పుష్పగాడి చెల్లిగా కనిపించబోతున్న స్టార్ హీరోయిన్.. సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!

వామ్మో.. సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్ .. పాన్ ఇండియా కాదు ..పాన్ వరల్డ్ స్థాయిలోనే ఆలోచిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. దిశా పటానీ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది .

ఈ సినిమాలో పుష్పరాజ్ గాడి చెల్లిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరి ఎవరో కాదు తృప్తి దిమ్రి. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన రాని గుర్తింపు యానిమల్ సినిమాతో సంపాదించుకుంది . ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . అనిమల్ సినిమాలో తృప్తి నటనపై బన్నీ కూడా ఓ రేంజ్ లో పొగిడేసారు .

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది తృప్తి అంటూ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది తెలుసుకున్న జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . సుకుమార్ డైరెక్షన్ ముందు మరి ఏ డైరెక్టర్ పనికిరారు అని ..ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారో..సుకుమార్ చూస్ చేసుకున్నంత బాగా మరి ఎవరు చూస్ చేసుకోలేరు అని ప్రశంసలు కురిపిస్తున్నారు . చూద్దాం మరి దీనిపై పుష్ప2 టీం ఎలా స్పందిస్తుందో..?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ చేశారు . సినిమా ప్రమోషన్స్ ని కూడా వేరే లెవెల్ లో చూపించేలా స్పెషల్ టీం ని కూడా డిజైన్ చేయించుకున్నాడు సుకుమార్ . ఈ సినిమాతో తెలుగు సినీ చరిత్రను తిరగరాయబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news