Moviesపాన్ ఇండియా కాదు అంతకుమించి.. బన్ని సినిమాలో ఆ ఇద్దరు స్టార్...

పాన్ ఇండియా కాదు అంతకుమించి.. బన్ని సినిమాలో ఆ ఇద్దరు స్టార్ హీరోస్.. ఫ్యాన్స్ ని అరుపులు పెట్టించే న్యూస్ ఇది..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం . టాలీవుడ్ కాదు .. కోలీవుడ్ కాదు ..బాలీవుడ్ కాదు ..హాలీవుడ్ కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక ఇండస్ట్రీలోని టాప్ హీరో మరొక ఇండస్ట్రీ హీరోతో కలిసి వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గా బడా పాన్ ఇండియా హీరోలు సైతం అదే విధంగా వర్క్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే స్టార్ మేకర్స్ కూడా క్రేజీ క్రేజీ కాంబోలు సెట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ న్యూస్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది .

ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సరికొత్త క్రేజీ కాంబోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది .ఈ సినిమాల్లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ సినిమాలో కధ అనుసారం.. ఇద్దరు స్టార్ హీరోస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట . ఆ ఇద్దరు కూడా సూపర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల కావడం గమనార్హం . వాళ్ళు మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సూర్య .. ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసి పడేస్తుంది . జనరల్ గా ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటేనే ఫ్యాన్స్ అరుపులను తట్టుకోలేము.. మరి ఒకే సినిమాలో ముగ్గురు స్టార్స్ .. అది కూడా పాన్ ఇండియా స్టార్స్ నటిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేయరు. సిల్వర్ స్క్రీన్ బద్దలైపోయేలా కేక పెట్టించారు ..ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news